రూ.కోట్లు కొల్లగొట్టిన రైస్ మిల్లర్లు

వనపర్తి జిల్లాలో రూ. 1240 కోట్ల కుంభకోణం
2,13,896 మెట్రిక్ టన్నుల వరిదాన్యం పక్కదారి
34 మంది మిల్లర్లపై కేసులు
రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు,
మిలర్ల కుమక్కు
మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: దొంగలు, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు వనపర్తి జిల్లాలో రెవెన్యూ, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై సిఎంఆర్ వరిదాన్యంను పంచుకుతిన్నారు. లక్షలు, రెండు లక్షలు కాదు ఏకంగా వందల కోట్ల కుంభకోణంకు తెరలేపారు.గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వంలో కూడా ఇదే తరహా దందా సాగుతున్నప్పటికీ రైస్ మిల్లర్లపై చర్యలు తీ సుకునేందుకు సాహసించడం లేదు. వనపర్తి జిల్లాలో జరిగిన ఈ భారీ వరిధాన్యంకుంభకోణంపై మనతెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ప్రతి ఖరీఫ్, రబి సీజన్‌లో ప్రభుత్వం మిల్లర్లకు వరి దాన్యం కేటాయింపులు చేస్తుంది.ఆ దాన్యంను రైస్‌మిల్లులో మర ఆడించి మిల్లర్ ప్రభుత్వంకు 67 కిలోల బియ్యంను తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఎప్పటికప్పుడుఇవ్వాల్సిన బియ్యంను ప్రభుత్వంకు ఇవ్వకుండా, ప్ర భుత్వం కేటాయించిన వరి దాన్యంను బయట బ్లాక్ మార్కెట్‌లో విక్రయించుకొని రైస్ మిల్లర్లు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది రైస్ మిల్లర్ల నుంచి బియ్యంను వసూళ్లు చేసుకోవాల్సిన రెవెన్యూ, సివిల్ సప్లయ్ శాఖ అధికారులు రైస్ మిల్లర్లతో కు మ్మక్కై చూసి చూడనట్లు వ్యవహరించంతో వందల కోట్ల దాన్యంను పక్కదారి పట్టించుకున్నారు. బియ్యంను తిరిగి ఇవ్వని రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోక పోగా ప్రతి ఏడాది తిరిగి సిఎంఆర్ వరి దాన్యంను మిల్లర్లకు కేటాయింపులు చేశారు.ఈ వ్యాపారం బాగా ఉండడంతో కొ ందరు బడా వ్యాపారులు రైస్ మిల్లులను బినామీ పేర్ల మీద ఏర్పాటు చేసుకున్నారు. పేరుకు చిన్నా జిల్లాగా ఉన్న వనపర్తి జిల్లాలో 187 రైస్ మిల్స్ పుట్టగొడుగుల్లా ఉన్నాయంటే ఇక్కడ బియ్యం దోపిడి ఎంత బా హటంగా జరుగుతుందో ఊహించుకోవచ్చు. గత ప్రభుత్వ హాయంలో కంచెచేను మేసిన చందంగా జాయింట్ కలెక్టరే బినామి అయితే ఇక చర్యలు తీసుకునే వారెవరనే ప్రశ్న తలెత్తింది. తన బినామీల పేర్లతో రై స్ మిల్స్ ఏర్పాటు చేసుకొని లక్షల క్వింటాళ్ల దాన్యంను పక్కదారి పట్టించినా చర్యలు శూన్యం. సిఎంఆర్ వరి దాన్యంను బినామి రైతుల పేర్లతో తిరిగి ప్రభుత్వంకే విక్రయించుకొని జేబులు నింపుకుంటున్నార న్న ఆరోపణలు ఉన్నాయి.ఏకంగా వందల కోట్లు ప్రభుత్వంకు కుచ్చుటోపి పెట్టారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వం రాజకీయ నేతలు రైస్ మిల్లర్లకు అండగా ఉండడంతో కోట్లు కొల్లగొట్టుకున్నారు.ఇటీవల సి విల్ సప్లయ్ శాఖ డిఎంపై ఎసిబి దాడులు చేసింది. ఈ వ్యవహారంలో ఒక జాయింట్ కలెక్టర్ పాత్ర ఉన్నట్లు ఎసిబి అధికారులు విచారించినట్లు తెలుస్తోంది.
పక్కదారి పట్టిన 2,13,896 మెట్రిక్ టన్నుల వరిదాన్యం
వనపర్తి జిల్లాలో 2021 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం ఖరీఫ్, రబి సీజన్ వరకు ఏకంగా 2,13,896 మెట్రిక్ టన్నుల దాన్యం పక్కదారి పట్టింది. వాటి విలువ దాదాపు రూ. 1240 కోట్లకుపైగా ఉంటు ంది. ఇన్ని కోట్లు తిన్న రైస్ మిల్లర్లపై రెవెన్యూ,సివిల్ సప్లయ్ శాఖ అధికారులు మొదటి నుంచి చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్ధితి ఉండేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతా అయిపోయన తర్వాత మేలుకున్నట్లు అధికారులు ఇప్పుడు మేలు కోవడంతో కొంత మంది రై స్ మిల్లర్లపై ఆర్‌ఆర్‌యాక్ట్ నమోదు చేయగా, మరి కొందరిపై వీరిపైనే ఎఫ్‌ఐఆర్ నమోదు
పానగల్‌కు చెందిన అబ్దుల్ ఖా దర్, కె.రాజేశ్వరి,పరమేశ్వర్ రెడ్డి,అనుష,పెబ్బేరుకు చెందిన మండ్ల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎ.పరమేష్, బాగ్యలక్ష్మి, పరమేష్, జగదీష్‌కుమార్, మదనాపురంకు చెందిన విజయ్‌భాస్కర్‌రెడ్డి, వనపర్తి రూరల్‌కు చెం దిన డి.రిషిత, వీపనగండ్లకు చెందిన గోపాల్ రెడ్డి,వనపర్తి పట్టణానికి చెందిన మహేశ్వర్ రెడ్డి,కె.రాజావర్దన్ రెడ్డి, ఆత్మకూరుకు చెందిన కొండా క్రి ష్ణయ్య శెట్టి, కొత్తకోటకు చెం దిన మధుకుమార్ రెడ్డి, వెంకటరమణ,పెద్ద మందడికి చెంది న ఎం. జ్యోతి,ఘనపూర్‌కు చెందిన రమేష్,వీపసగండ్లకు చెందిన శివకుమార్‌రెడ్డి, చిన్నంబావికి చెందిన ఎ.శ్రీనివాసులు,అభిలాష్ రెడ్డి,పి. లక్ష్మి బార్గవి, శ్రీరంగాపూర్‌కు చెందిన సయ్యద్ అహ్మద్, మదనాపూర్‌కు చెందిన మంజులు,వనపర్తి రూరల్‌కు చెందిన సి. చంద్రయ్య, పెద్ద మందడి శివప్రసాద్ రెడ్డి, గురునాథ్,ఘనపూర్ సిందూజరెడ్డి, కొత్తకోటకు చెందిన వీణ, ఘనపూర్ పద్మశ్రీలు కేసులు ఎదుర్కొంటున్నారు. వీరిలో కొందరు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోగా మరి కొందరు ము ం దస్తు బెయిల్స్ తీసుకున్నారు.
యధారాజా తథా ప్రజ
వంద కోట్లు విలువ చేసే దాన్యంను పక్కదారి పట్టించిన రైస్ మిల్లర్లు కొ ందరు ( అందరూ కాదు) తిరిగి బినామి పేర్లతో రైస్ మిల్స్‌ను ఏర్పాటు చేసుకొన్నారు. అధికారులతో కుమ్మక్కై తిరిగి సిఎంఆర్ బియ్యంను కేటాయింపులు చేసుకొని అదే బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇ టీవల పెబ్బేరు,శ్రీరంగాపూర్‌లో విజిలెన్స్ దాడులు చేయడంతో వెలుగులోకి వచ్చింది. కొందరు రైస్ మిల్లరు ఇప్పటికీ తమ దాన్యం అవినీతి దందాను ఆపక పోగ ఇతర రాష్ట్రాలకు సైతం తరలించుకొని సొమ్ము చేసుకుంటున్నారు.
Tags
-
Home
-
Menu
