సిద్దిపేట జిల్లాలో విషాదం.. ఆర్టీసి బస్సు కిందపడి వ్యక్తి మృతి

X
ఆర్టీసీ బస్సు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేటలోని పొన్నాల దాబా వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. మరణించిన వ్యక్తిని మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన నారదాసు బాలరాజుగా పోలీసులు గుర్తించారు. రోడ్డుపై ఆర్టీసి బస్సు వస్తుండగా మృతుడు దాని టైర్ల కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసి ఫుటేజీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
