కుక్కను తప్పించబోయి కారు పల్టీ.. భార్య మృతి.. భర్త, పిల్లలకు గాయాలు

కుక్కను తప్పించబోయి కారు పల్టీ.. భార్య మృతి.. భర్త, పిల్లలకు గాయాలు
X

మన తెలంగాణ/మోతె: సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ మరణించగా, ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న పలువురు వ్యక్తులు సూర్యాపేట ఖమ్మం 365 బిబి నేషనల్ హైవే 1033 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి, టోల్‌గేట్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. వెంటనే 1033 పెట్రోలింగ్ సిబ్బంది, 1033 అంబులెన్స్ సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకొని క్షతగాత్రులకు ఫస్ట్ ఎయిడ్ చేసి ఖమ్మం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం, పోచవరం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి కారులో తెల్లవారుజామున బయల్దేరారు. సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి చెట్లపొదల్లోకి కారు దూసుకెళ్లి పల్టీ కొట్టింది.

ఈ ప్రమాదంలో రాణి (38) అనే గృహిణి మృతి చెందగా, ఆమె భర్త శ్రీరామ్ (52)కు స్వల్ప గాయాలయ్యాయి. వారి కుమార్తె జాహ్నవి (11), కుమారుడు లోకేష్ (10) తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. మృతురాలి భర్త శ్రీరామ్ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ టి. అజయ్‌కుమార్ కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్ట్టు తెలిపారు. కాగా, 1033 వాహనానికి సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.

Tags

Next Story