మోత్కూర్ లో ఘనంగా ఎఐటియుసి ఆవిర్భావ దినోత్సవం

మోత్కూర్ లో ఘనంగా ఎఐటియుసి ఆవిర్భావ దినోత్సవం
X

మన తెలంగాణ/మోత్కూర్: ఎఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సివిల్ సప్లై యూనియన్ ఆధ్వర్యంలో ఎఐటియుసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి జంగా నరసయ్య జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అన్నెపు వెంకట్ పాల్గొని వారు మాట్లాడుతూ.. ఎఐటియుసి ఆవిర్భావం అయిన నాటినుండి కార్మిక కర్షక హక్కులకై నిరంతరం పోరాటం చేస్తున్న జెండా అని తెలిపారు. కార్మికుల హక్కులకై పోరాటం చేస్తున్నది ఎఐటియుసి అని, ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని పిలుపునిస్తున్నదని వెంకట్ తెలియజేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉండాలని వారి సమస్యలను పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై యూనియన్ అధ్యక్షుడు పురుగుల రవి, సిపిఐ శాఖ కార్యదర్శి బోయిని ఉప్పలయ్య, గొలుసుల యాదగిరి, పంగ వెంకన్న యాదగిరి పురుగుల, జీడయ పరశురాములు, రమేష్ గొడుగు, శ్రీను, మచ్చ గిరి, తాడూరు లక్ష్మీనరసయ్య, తదితరులు పాల్గొన్నారు

Tags

Next Story