వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన కౌన్సిలర్, వైస్ ఛైర్మన్
మన తెలంగాణ/మోత్కూర్ వనమహోత్సవంలో భాగంగా మోత్కూర్ మున్సిపాలిటీ లోని అన్నెపువాడ లో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. మున్సిపల్ కౌన్సిలర్ కారుపోతుల వెంకన్న గౌడ్ స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోడ్ల వెంట పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు.
“ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు పచ్చదనం పెంపొందించడం మనందరి బాధ్యత” కారుపోతుల వెంకన్న అని తెలియజేశారు. కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ రాచర్ల సంధ్య రాణి ,అసిస్టెంట్ వార్డ్ ఆఫీసర్ ఎడ్ల నరేందర్, నక్క రాజు, కనుకు సతీష్, కారుపోతుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
మోత్కూర్ మున్సిపాలిటీ లోని ఒకటవ వార్డులో వన మహోత్సవం లో భాగంగా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మున్సిపల్ వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న గుప్తా తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి భాద్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వార్డు ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags
-
Home
-
Menu


