వరి పత్తి పంటల క్షేత్ర పరిశీలన

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని మోత్కూరు క్లస్టర్ పరిధిలోని అనాజిపురం గ్రామంలో శాస్త్రవేత్తలు పంటల క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ వికె భువనగిరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి. శ్రీలత, కెవికె కంపసాగర్ శాస్త్రవేత్తలు రాములమ్మ, స్వాతి లు రైతుల వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి పంటల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలో సాగు చేస్తున్న ప్రధాన పంటలైన వరి, పత్తి, కంది, ఆముదం పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంటల పెరుగుదల, పురుగు, తెగుళ్ల పరిస్థితిని రైతులతో చర్చించారు. పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, పురుగు , తెగుళ్ల ఉధృతి ఆర్థిక నష్ట పరిమితిని దాటినప్పుడు మాత్రమే అవసరమైన సస్యరక్షణ చర్యలను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని రైతులకు సూచించారు.
పత్తి పంటలో తామర పురుగు ఉధృతి ఉన్న ప్రాంతాల్లో పంట పరిస్థితిని బట్టి తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పంట పెరుగుదల మరియు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే వినియోగించాలని రైతులకు సూచించారు. వరి పంటలో కూడా క్షేత్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పురుగు , తెగుళ్ల ఉధృతిని బట్టి తగిన సస్యరక్షణ మరియు సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ, పంటల్లో కనిపించే సమస్యలను వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఆర్. సింహ ప్రసాద్, జి. సోమప్ప, రైతులు బోరెడ్డి రోషిరెడ్డి, ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags
-
Home
-
Menu
