ధాన్యం కొనుగోలు చేసి ఎగుమతి చేయాలి

X
మన తెలంగాణ/మోత్కూర్: వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపద్యంలో మాయిశ్చర్ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల వారితో మాట్లాడి ఎగుమతి చేయాలని మోత్కూర్ సింగిల్ విండో చైర్మన్ పేలాపూడి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం మోత్కూర్ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యపు రాశులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తేమ శాతం తక్కువ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రం నిర్వాహకులకు తెలిపారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో కార్యదర్శి కె.వరలక్ష్మి, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
