మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు

మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు
X

తహశీల్దార్ జ్యోతి


మన తెలంగాణ/మోత్కూర్: మతసామారస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని తహశీల్దార్ పి. జ్యోతి అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని డ్రైవర్ కాలనీ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాజంలో మతసామరస్యాన్ని ఐక్యతను పెంపొదించి పరమావధిగా సాగే పవిత్ర మాసం రంజాన్ అని అన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా మండుతుండటంతో ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహాశీల్దార్ వెంకటేశ్వర రెడ్డి, ఆర్ఐ సుమన్, మార్కెట్ చైర్మన్ నూనె ముంతల విమల వెంకటేశ్వర్లు , వైస్ ఛైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న, వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం లక్ష్మీనరసింహారెడ్డి, అవిశెట్టి ఆవిలిమల్లు , పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుండగోని రామచంధ్రు, మార్కెట్ డైరెక్టర్ మహమ్మద్ సమీర్ , ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.





Tags

Next Story