చేనేత కార్మికులందరికి వెంటనే రుణమాఫీ వర్తింపచెయ్యాలి

Loan waiver
మన తెలంగాణ/మోత్కూర్: రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికులదరికీ రుణవిముక్తి చేస్తామని దాదాపు 18 నెలల క్రితం హామీ ఇచ్చి, ఇన్ని రోజులు కాలయాపన చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల లబ్ధికోసం కేవలం మున్సిపాల్టీ పరిధిలోని కార్మికులకు రుణ మాఫీ వర్తింపచేయడం అన్యాయమని, ఇచ్చిన హామీమేరకు చేనేత కార్మికులందరికి రుణ మాఫీ వర్తింపచేయాలని చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మోత్కూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమత్రి స్వయంగా రాష్ట్రంలోని చేనేత కార్మికులందరినీ రుణ విముక్తి చేస్తామని చెప్పడమే కాక, 33 కోట్లు విడుదల చేస్తామని జిఓ కూడ ఇస్తున్నట్లు సభవేదిక నుండి దాదాపు 18 నెలల క్రింద ప్రకటించారని తెలిపారు. హామీని అమలు చెయ్యాలని ఎన్నోసార్లు సంబందిత మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, కమిషనర్ ని కలసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నవంబర్ 20 పెద్ద ఎత్తున చేనేత కార్మికులు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడంతో స్పందించిన ప్రభుత్వం 33 కోట్లు ఆర్ధిక శాఖకు విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసిందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేనేత కార్మికులందరికి వెంటనే రుణమాఫి వర్తింప చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు.
Tags
-
Home
-
Menu
