17న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే సామేల్

మన తెలంగాణ/మోత్కూర్: తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఈనెల 17 న శంకుస్థాపన చేయనున్నారని మున్సిపల్ కమిషనర్ కె. సతీష్ కుమార్ శనివారం విలేకరులకు తెలిపారు.మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో టియుఎఫ్ఐడిసి ద్వారా మంజూరైన నిధులు రూ. 5 కోట్లతో మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులలో ఈనెల 17 న స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మున్సిపాలిటీ లోని 12 వార్డుల్లో సిసి రోడ్లు, డ్రైనేజి నిర్మాణ పనులకు, మున్సిపల్ కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ కామన్ నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు సిసి రోడ్డు నిర్మాణం, మున్సిపల్ కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి అంగడి బజార్ వరకు కొత్తగా నిర్మించే సిసి రోడ్డు,అండర్ డ్రైనేజ్ నిర్మాణం, జామచెట్ల బావి నుండి కొండాపురం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారని మున్సిపల్ కమిషనర్ తెలిపారు.
Tags
-
Home
-
Menu
