వినూత్న రీతిలో ఉగాది వేడుకలు... ముత్యాలమ్మకు బోనాలు.. ఎడ్ల బండ్ల ప్రదర్శన

వినూత్న రీతిలో ఉగాది వేడుకలు...  ముత్యాలమ్మకు బోనాలు.. ఎడ్ల బండ్ల ప్రదర్శన
X

బోనాలతో మహిళలు

మన తెలంగాణ/మోత్కూర్ : రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా యాదాద్రి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వినూత్న రీతిలో ఉగాది వేడుకలు జరిగాయి. ఉగాది పండగంటే షడ్రుచులతో ఉగాది పచ్చడి, భక్షాలు , మోత్కూర్ లో మాత్రం అందుకు భిన్నంగా ఉగాది పచ్చడి తో పాటు ముక్క, చుక్క తో ఉగాది వేడుకలు జరుగుతాయి. చెరువు కట్ట మీది ముత్యాలమ్మ కు, పడమటి ముత్యాలమ్మ లకు ఆడపడుచులు బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. తమ కుటుంబాలు పాడి పంటలు చల్లంగా చూడాలని పూజలు చేశారు. మున్సిపల్ కేంద్రం లోని ఉన్నత పాఠశాల ఆవరణలో అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, కార్లు,ఆటోలు ప్రదక్షిణలు చేశారు. సిఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, వైస్ ఛైర్మన్ పల్లెర్ల వెంకన్న లు ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మున్సిపల్ అధికారులు, పాలక వర్గం ఉగాది వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.




ఘనంగా ఉగాది వేడుకలు...

మోత్కూర్ మున్సిపాలిటి పరిధిలోని బుజిలాపురం, కొండగడప , ధర్మాపురం లతో పాటు మండలంలోని అనాజీపురం,పాటిమట్ల, దత్తప్పగూడెం, పాలడుగు, ముషిపట్ల, రాగి బావి, పనకబండ,సదర్శాపురం,దాచారం, పొడిచేడు గ్రామాల్లో ప్రజలు భక్తులు ప్రత్యేక పూజలు జరిపి ఉగాది పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. బుజిలాపురం లో కంఠ మహేశ్వర స్వామికి బోనాలు సమర్పించారు..కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, గ్రామాల సర్పంచ్ లు ,ఉప సర్పంచ్ లు వార్డు సభ్యులు ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story