మోత్కూరు మండలంలో ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేత

మన తెలంగాణ/మోత్కూర్: సంక్రాంతి పండుగ సందర్భంగా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో గడి బజార్ యువత సహకారంతో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో విజేతలకు, పాల్గొన్న మహిళలకు మోత్కూర్ సిఐ వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు. మండలంలోని దాచారంలో గ్రామస్తులతో మోత్కూర్ సి ఐ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించి, వాహనదారులు హెల్మెట్ ధరించడంతో పాటు మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేయవద్దని సూచించారు. వారికి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు, నియమాలపై క్విజ్ పోటీ నిర్వహించి, ప్రజల్లో అవగాహన పెంపొందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశం, ఎస్సై కె.సతీష్, ఏఎస్సై శ్రీనివాస్ రావు, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత పాల్గొన్నారు. దాచారం గ్రామంలో ముగ్గుల పోటీలు, కబడ్డీ, క్రికెట్, తాడు గుంజుడు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
-
Home
-
Menu
