మృతురాలి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

X
Pelapudi Brothers give money to family of deceased
మన తెలంగాణ/మోత్కూర్: యాద్రాది భువనగిరి జిల్లా మోత్కూరు మండలం లోని పొడిచేడు గ్రామానికి చెందిన జిట్ట ముత్తమ్మ ఇటీవల మృతి చెందగా శనివారం మృతురాలి కుటుంబాన్ని పేలాపూడి బ్రదర్స్ పరామర్శించి 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. పేలపూడి సత్యనారాయణ చౌదరి, సింగిల్విండో చైర్మన్ పేలాపూడి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ పేలాపూడి మధు లు ఆర్థిక సహాయం అందజేయగా నాయకులు కప్పే మల్లేష్, దెందే యాదగిరి, పర్వతం షణ్ముఖ చారి లు 75 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ జిట్ట లక్ష్మయ్య, నాయకులు మల్లం రమేష్, దెందే మల్లేష్, జిట్ట బుచ్చయ్య, జిట్ట గౌరయ్య,జిట్ట నర్సయ్య, జిట్ట గణేష్, తొంట దిలీప్, జిట్ట స్వామి, తొంట స్వామి, సలిగంజి సుధాకర్,జిట్ట వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story
-
Home
-
Menu
