కెసిఆర్, బిఆర్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు.... రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

మోత్కూర్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను బిఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్బంగా మాజీ మార్కెట్ కమిటీ మాజీ చేర్మెన్ కొణతం యాకుబ్ రెడ్డి, మండలపార్టీ అధ్యక్షులు పొన్నేబోయిన రమేష్ లు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్టంలో బిఆర్ఎస్ గద్దెలను కులగొట్టాలని ఒక వీధి రౌడీల్లా మాట్లాడుతున్నావని, రేవంత్ రౌడీవా? రాష్టానికి ముఖ్యమంత్రివా? అంటూ విమర్శలు గుప్పించారు. దిమ్మెలను కులగొట్టగలవేమోగాని ప్రజలగుండెల్లో ఉన్న గులాబీ జేండను చేరపలేవని, ముఖ్యమంత్రి మాటాల ద్వారానే అర్ధమవుతుందని, ఆంధ్ర బ్రోకర్ అని, చంద్రబాబు తొత్తువు అని మండిపడ్డారు. రాక్షసుల గురువు, రేవంత్ కలిసి తెలంగాణ రాష్టాన్ని పీక్కుతింటున్నారని యాకుబ్ రెడ్డి దుయ్యబట్టారు.
'తెలంగాణ రాష్టాన్ని తెచ్చినందుకు కెసిఆర్ బొందపెడుతారా?, బొందపెట్టడం కాదు కాదా దమ్ముంటే టచ్ చేసి చూడు రేవంత్, కెసిఆర్ శక్తి ఏమిటో తెలుస్తుంది, దొంగలకు దొంగ మాటలేవస్తాయి, పరిపాలనచేతగాక ఏమిచేయాలో అర్థంగాక ఒక మానసిక రోగిలా మాట్లాడుతున్నావు' అని పొన్నేబోయిన రమేష్ విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి గజ్జి మల్లేష్, రైతుబంద్ మాజీ అధ్యక్షులు కొండా సోoమల్లు, మండల బిసి సెల్ అధ్యక్షులు పానుగుల్ల విష్ణు, ఎస్ సి ఎస్ టి అట్రాసిటీజిల్లా మెంబర్ దాసరి తిరుమలేష్, మొరిగాలశ్రీను, చోళ్ళేటి నరేష్, కూరెళ్ల రమేష్, బందెల శ్రీను, లోతుకుంట అనిల్, అజయ్ మొరిగాలరాజు, కొంపెల్లి రమేష్, కూరెళ్ల పరమేష్, విద్యాసాగర్, చుక్క అశోక్, చెడేపల్లి రఘుపతి, కనుకు రాజు, దండ్ల కళ్యాణ్, వడ్డేపల్లి నగేష్, జలాల్, చుక్క వెంకన్న, నల్లబోగుల సతీష్, వల్లందాసు సతయ్య, గురజాల నగేష్, తదితరులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
