సర్పంచ్ ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జ్యోతి వీరేశం

X
Sarpanchs Association State General Secretary Karne Jyothi Veeresham
మన తెలంగాణ/మోత్కూర్: సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మోత్కూర్ మండలంలోని దాచారం గ్రామ సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశం ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సర్పంచుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సౌదాని భూమన్న యాదవ్ హైదరాబాద్‌లోని రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యాలయంలో కర్నె జ్యోతి వీరేశం నియామకం చేస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పండితరావు పటేల్, ఆత్మకూరు మాజీ జెడ్పిటిసి గంగాపురం మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
