ముంపుకు గురవుతున్న ఎస్ సి కాలనీని సమస్యను పరిష్కరించాలి

SC colony flooded
X

SC colony flooded 

స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఎస్సీ కాలనీ సందర్శించాలి

గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, వెటర్నరీ సెంటర్ ఏర్పాటు చెయ్యాలమన తెలంగాణ/మోత్కూర్: ముంపునకు గురవుతున్న పాలడుగు ఎస్ సి కాలనీని స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ లు సందర్శించి వారి సమస్యలను పరిష్కరించాలని, సిపిఎం పార్టీ యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి జాహంగీర్ డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక కుటుంబ సర్వేలో భాగంగా మోత్కూర్ మండలం పాలడుగు గ్రామంలో ఆయన పాల్గొని ఎస్సీ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పాలడుగు గ్రామంలోని పెద్ద చెరువు నిండి అలుగు పోస్తే, ఎస్సీ కాలనిలోకి నీరు వస్తుందని, ఇండ్లలో జాలు నిమ్ము ఉండటంతో క్రిమికిటాకాలు ఇండ్లలోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు.

దీంతో ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం కూడ ఉందని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్, జిల్లా కలెక్టర్ ఎస్సీ కాలనీని సందర్శించి వారికి తగిన న్యాయం చెయ్యాలని కోరారు. గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, వెటర్నరీ సెంటర్ ను ఏర్పాటు చెయ్యాలని, దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న గ్రామాలలో పాలక వర్గాలు లేక పారిశుధ్యం, మంచినీరు, వీదిలైట్లు, లాంటి అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, మండల కమిటీ సభ్యులు కొంపల్లి ముత్తమ్మ, ఆత్మకూర్ మండల కార్యదర్శి వేముల బిక్షం, బోడ హన్మంతు, గ్రామ శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, కొంపల్లి గంగయ్య, చింతకింది సోమరాజు, వడ్డేపల్లి లక్ష్మణ్, నాయకులు కొంపల్లి నర్సయ్య, కొంపల్లి బిక్ష్మయ్య, కొంపల్లి ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story