ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

X
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, అంగన్వాడి 1,2 కేంద్రాలలో మంగళవారం స్వపరి పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నారులు ఉపాధ్యాయులుగా తమ పాత్రలు పోషించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్ ను మున్సిపల్ కౌన్సిలర్ మొగుళ్ల అనూరాధ శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అనూరాధ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. కౌన్సిలర్ కు శాలువ కప్పి ఉపాధ్యాయులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. ఉమేష్ చంద్ర, ఉపాధ్యాయురాలు ఆండాలమ్మ, అంగన్వాడీ టీచర్లు చింతల విజయ, చుక్క సునీత, ఆయా మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story
-
Home
-
Menu
