నిజామాబాద్ లో తల లేని మొండెం... మహిళ ఎవరు?

X
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ వద్ద మహిళ హత్యకు గురైంది. గుర్తు తెలియని మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా మహిళ మృత దేహం కలిపించింది. తల, సగం వరకు కుడి చేయి లేకుండా మృత దేహం కనిపించింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేరే ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని, హత్యకు గురైన మహిళ వయసు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story
-
Home
-
Menu
