బోడుప్పల్‌లో ఉద్రిక్తత

X
బిఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడికి యత్నం
మేడపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి మండలంలోని బోడుప్పల్‌లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బిఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం కాంగ్రెస్ శ్రేణులు కార్యాలయం ఎదుట బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Tags
Next Story
-
Home
-
Menu
