కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన యువకుడు

కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడిన యువకుడు
X

కదులుతున్న రైలు ఎక్కబోయిన ఓ యువకుడు జారి కింద పడడంతో రెండు కాళ్లు కోల్పోయాడు. ఈ ఘటన కామారెడ్డి లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. స్థానికులు, రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని ఉమ్రి జిల్లాకు చెందిన అనిల్ బుధవారం రాత్రి కామారెడ్డి రైల్వే స్టేషన్ లో కదులుతున్న రైలును ఎక్కబోయాడు. ఈ క్రమంలో అదుపుతప్పి జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో అనిల్ రెండు కాళ్లు తెగిపోయాయి. వెంటనే రైల్వే పోలీసులు చికిత్స నిమిత్తం అనిల్ ను ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డిలోని జీజీ హెచ్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story