కాలపరీక్షకు నిల్చిన భారత్-రష్యా మైత్రి

భారత్ష్య్రా 23 వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ అరుదెంచడం యావత్ ప్రపంచ దేశాల దృష్టి భారత్‌పైనే ఉంది. ఈ సదస్సు ప్రక్రియ 2000 సంవత్సరం లో ప్రారంభమైన తరువాత పుతిన్ పర్యటన నాలుగేళ్ల విరామం చేసుకోవడం ఇంతవరకు లేదు. అగ్రరాజ్యం అమెరికా సహా నాటో కూటమి లోని అన్ని దేశాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించడం అమెరికాతోపాటు పొరుగున ఉన్న పాకిస్థాన్ నిశితంగా గమనిస్తోంది. భారత దేశానికి చిరకాల మిత్ర దేశంగా ఉన్న రష్యా గత కొన్ని దశాబ్దాలుగా భారత్‌కు రక్షణ, సాంకేతిక పరిజ్ఞాన, తదితర రంగాల్లో సహాయం అందిస్తోంది. పుతిన్ తాజా పర్యటనతో భారత్ రష్యా మధ్య ఏయే రంగాల్లో ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయన్నది ఆసక్తిగా మారింది.
ఇప్పుడు ఉభయ దేశాల ప్రభుత్వాల మధ్య వ్యూహాత్మక పరస్పర ప్రయోజన ఒప్పందాలు పది వరకు, అలాగే వాణిజ్య, వాణిజ్యేతర సంస్థల మధ్య 15 ఒప్పందాలు మొత్తం 25 ఒప్పందాలు కుదురుతాయని తెలుస్తోంది. ఇవి కాక ఈ సదస్సులో రెండు లక్షాలు తెరపైకి వస్తాయని చెబుతున్నారు. మొదటిది ద్వైపాక్షిక సంబంధాలను నడిపించే నాయకత్వం, రెండోది రష్యా ఉక్రెయిన్ యుద్ధ నివారణకు చేస్తున్న ప్రయత్నాలపై సమీక్ష. ద్వైపాక్షిక సంబంధాల విషయానికి వస్తే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కాలపరీక్షకు నిలబడుతున్నాయి. సోవియెట్ యూనియన్ పతనమైనా, భారత్‌అమెరికా సంబంధాలు బలపడినా, 2020లో చైనా భారత్ సరిహద్దుల మధ్య సంఘర్షణలు చెలరేగినా, ఉక్రెయిన్ యుద్ధం, ఆపై అమెరికా, పశ్చిమదేశాల ఆంక్షలు, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్‌ల భారం అత్యధికంగా పెంచినా సరే రష్యాతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం చెక్కుచెదరలేదు. అగ్రదేశాల ద్విధ్రువత్వం, ఏకధ్రువత్వం, బహుళ ధ్రువత్వ ప్రచ్ఛన్న యుద్ధాల నుంచి ఈ ద్వైపాక్షిక బంధాలు ఎదురొడ్డి నిలిచాయి.
స్టాక్ మార్క్‌ట్ విషయంలో భారతీయ విదేశీ విధానానికి రష్యా ఒక ఆస్తి వంటిదే. ఎలాంటి మెరుపులు లేకపోయినా, నిదానమైన, స్థిరమైన, ఊహించదగిన రాబడులను రష్యా అందిస్తోంది. గత 15 సంవత్సరాలుగా భారత్ రష్యా సంబంధాలు రూపాంతరం చెందాయి. రక్షణ రంగ సహకార సాపేక్ష ప్రాముఖ్యం నిదానంగా తగ్గుతూ వస్తున్నప్పటికీ, కొత్త రంగాల్లో సహకారం పెరుగుతోంది. చారిత్రకంగా భారత్ రష్యా మధ్య రాజకీయ, వ్యూహాత్మక సంబంధాలు వాటి వాణిజ్యం, ఆర్థిక భాగాలకంటే అతీతమైనవి. ఇతర ప్రధాన దేశాలకన్నా ఇవి భిన్నమైనవి. ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఎంతో నిగూఢంగా ఉన్నాయి. ఉదాహరణకు రష్యాకు భారత్ నుంచి ఎగుమతులు బంగ్లాదేశ్ కన్నా తక్కువగానే ఉన్నాయి. ఇంధన రంగంలో ఉభయదేశాల పరస్పర పెట్టుబడులు అమితంగానే ఉంటున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సదస్సులో భారత్ భావి ప్రగతికి అవసరమైన ఇంధనం, ముడి వనరులు, కీలకమైన ఖనిజాలు, ఎరువులు, ఫార్మాక్యూటికల్స్, వ్యవసాయం, సముద్రమార్గాల అనుసంధానం, తదితర ముఖ్యమైన అంశాలపైనే దృష్టి కేంద్రీకరించనున్నారు. భారత్ నుంచి మానవ వనరులను రష్యాకు పంపించడం అత్యంత ప్రభావితం చేస్తోంది. పుతిన్ పర్యటన లోని రెండో ప్రధాన లక్షం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగింప చేయడం. ఈ విషయంలో రెండు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ మేరకు అమెరికా, రష్యా అధ్యక్షులతో భారత్ చర్చల పరంపర కొనసాగిస్తూనే ఉంది .
ఈ ప్రయత్నాలు ఫలించినా, విఫలమైనా ప్రపంచ దేశాల మధ్య సమతుల్యతకు భంగం కలగకూడదు. ఐరోపా దేశాల ఉద్రిక్తతలు భారత్‌కు తెలుసు. ఇందులో భారత్ ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. భారత్ ఎప్పుడూ ఉక్రెయిన్ విషయంలో శాంతి ఒప్పందం కుదరాలనే ఆకాంక్షిస్తోంది. అదే భారత్ విదేశాంగ విధానం. వాస్తవానికి ఉక్రెయిన్ చుట్టూ అత్యంత సంక్లిష్ట అంశాలు ముడిపడి ఉన్నాయి. రాజకీయ మార్గం ద్వారా శాంతి వైపు చర్చలు జరపడమే పరిష్కార సూత్రం. శాంతి ప్రక్రియవైపు పుతిన్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ అమెరికాతో పుతిన్ చర్చించేటప్పుడు భారత్ వినడమే తప్ప మరేం చేయడానికి వీలుపడదు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కుదిరి అమెరికారష్యాల మధ్య సంబంధాలు తిరిగి బలపడితే అవి భారత్ విషయంలో భౌగోళిక రాజకీయ వేదికను మార్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు బెడిసికొడితే మనం పూర్తి స్థాయి రెండో ప్రచ్ఛన్న యుద్ధం వైపు చూడవలసి వస్తుంది.
మరోవైపు రష్యా ఎప్పుడూ భారత్‌ను కీలక భాగస్వామ్య దేశంగానే పరిగణిస్తోంది. తన స్వప్రయోజనాలను ఆసియా లోని చైనాకు బలిపెట్టడానికి ఇష్టపడడం లేదు. మాస్కో దృష్టిలో చైనా రష్యాకు సంఘీభావం తెలుపుతూనే ఐరోపా దేశాలతో సంబంధాలను తెంచుకోవడం లేదు. ఈ విధంగా చైనా లాభపడడం రష్యాకు నష్టదాయకంగానే ఉంటోంది. సుదీర్ఘకాలంలో చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలన్న ఆలోచనతో రష్యా ఉంటోంది. భారత్ మాదిరి అమెరికా చైనా మధ్య మైత్రీ బంధాలు ఎలా ఉంటున్నాయో రష్యా గమనిస్తోంది. చైనాతో ట్రంప్ జి2 వ్యూహం రూపొందించుకోవడానికి ఆలోచిస్తున్నారు. అంటే అమెరికా, చైనా రెండూ ఒకే బాట, మాటపై ఉంటే ఏదైనా సాధించవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. అయినాసరే అమెరికాతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నా రష్యాతో సంప్రదించకుండా చైనా ఉండదు. ఏదెలాగున్నా మనం ఇప్పుడు పొత్తుల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇప్పుడు భారత్ష్య్రా మధ్య సాగుతున్న చర్చలు గొప్ప వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి దారి చూపిస్తాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
-
Home
-
Menu
