జనవరి 24 నుండి హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్

హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 16వ ఎడిషన్ 2026, జనవరి 24నుండి 26వరకు సత్వ నాలెడ్జ్ సిటీ, ఇంకా డిస్ట్రిక్ట్ 150, హైటెక్ సిటీ, హైదరాబాద్‌లో జరగనున్నాయి. ‘పర్యావరణ పరిరక్షణ’కి అంకితం చేస్తూ సాగుతున్న ఈ ఫెస్టివల్‌లో 15 థీమిటికల్ అంశాలు, సాహిత్యం, కవిత్వం, సైన్స్, మీడియా, సినిమా, ఆదివాసీ భాషలు వంటి వాటిపై జరగనున్నాయి. దేశ, విదేశాలకు చెందిన రచయితలు, చిత్రకారులు, కళాకారులు, బుద్ధి జీవు లు, పత్రికా విలేకరులు, విధాన రూపకర్తలు పాల్గొననున్నారు. ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, బ్రిట న్ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ ఫెస్టివల్‌లో ప్రవేశం ఉచితం. ప్రపంచ సాహిత్యంతో పాటు, మన దేశంలోని ఇతర భాషలలో వస్తున్న సాహిత్యాన్ని తెలుసుకోవడానికి, రచయితలను కలవడానికి, వారి మాటలను వినడానికి ఇలాంటి ఫెస్టివల్స్‌లో అవకాశం దొరుకుతుంది. కైలాష్ సత్యార్థి ప్రారంభోపన్యాసం చేస్తారు. నోబెల్ బహుమతి పొందిన ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, గోపాలకృష్ణ గాంధీ వంటి ప్రముఖులు మాట్లాడుతారు. ఈ 3రోజు లు పలు అంశాలపై వర్క్‌షాప్‌లు, ఎగ్జిబిష న్లు, సాంస్కృతిక కార్యక్రమాలు అనే కం జరుగుతాయి.
Tags
-
Home
-
Menu
