తెలుగులో మొదటి నార్డిక్ క్రైం ఫిక్షన్ నవల.. జార్ సిటీ

తెలుగులో మొదటి నార్డిక్ క్రైం ఫిక్షన్ నవల.. జార్ సిటీ
X

స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్ లాండ్‌లకు చెందిన రచయితలు గత కొన్ని దశాబ్దాలు గా గొప్ప క్రైమ్ ఫిక్షన్ నవలలు రాస్తున్నారు. ఎక్కువ శాతం ఇవి నేర పరిశోధన ముఖ్యాంశంగా ఉం టాయి. ఈ భాషల్లో వచ్చే నేర కథల సాహిత్యం ‘నార్డిక్ క్రైమ్ ఫిక్షన్’ పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. అలా నవలలు రాసి ప్రసిద్ధులైనవారిలో నార్వేకు చెందిన జో నెస్బో, స్వీడన్‌కు చెం దిన హెన్నింగ్ మాంకెల్, స్టీగ్ లార్సన్, కెమిల్లా లాక్‌బర్గ్, డెన్మార్క్‌కు చెందిన సారా బ్లేడెల్, ఐస్ లాండ్‌కు చెందిన ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ ముఖ్యులు. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ రాసిన ప్రసిద్ధ నవల, ‘జార్ సిటీ’ని వై.కృష్ణజ్యోతి తెలుగులోకి అనువాదం చేశారు. ఈ మధ్యనే ఛాయా పబ్లికేషన్స్ నించి విడుదలైంది ఈ నవల. ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ ఐస్‌లాండ్‌కు చెందిన సుప్రసిద్ధ డిటెక్టివ్ నవలల రచయిత. ఆయన గతంలో జర్నలిస్టుగా, ఫిల్మ్ క్రిటిక్‌గా పనిచేశారు. డిటెక్టివ్ ‘ఎర్లెండర్’ ప్రధానపాత్రధారిగా ఆయన ఇప్పటిదాకా పదకొండు నవలలు రాశారు.

ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ వరుసగా రెండు సంవత్సరాలు నార్డిక్ క్రైమ్ నవల బహుమతి (Nordic Crime Novel Prize) గెలుచుకున్న అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అంతేకాక, ఆంగ్ల భాషలో అత్యుత్త మ నేర నవల కోసం ఇచ్చే ప్రపంచ ప్ర ఖ్యా త CWA గోల్డ్ డాగర్ అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు. ఆర్నాల్డుర్ నవల లు ప్రపంచవ్యాప్తంగా 40 భాషలలో ఇప్పటిదాకా 14 మిలియన్ల కాపీలకు పైగా అమ్ముడయ్యాయి. కథలోకెళితే హోల్బర్గ్ అనే వయసు పైబడ్డ వ్యక్తి ఇంట్లో హత్య చేయబడటంతో మొదలవుతుంది. హత్యా స్థలంలో హంతకుడు రాసివెళ్ళిన నోట్ తప్ప వేరే ఆధారాలేం దొరకవు. రేకవిక్ నగరంలో మొదలైన పరిశోధన, ఐస్‌లాండ్ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి, ఎన్నో ఆసక్తికరమైన మలుపులు తిరిగి చివరికొస్తుంది. ఇన్స్‌పెక్టర్ ఎర్లెండర్ ఈ పరిశోధనకు ఆధ్వర్యం వహిస్తాడు. ఎర్లెండర్ కుటుంబ జీవితం అంత సజావుగా సా గుతూ ఉండదు. ఎ ర్లెండర్‌కు ఇద్దరు ఎదిగిన పిల్లలు. వాళ్ళు డ్రగ్స్‌కి అలవాటు పడి, ఇబ్బంది పడు తూ, పెడుతూ ఉం టారు. ఎర్లెండర్‌తో పనిచేసే పోలీస్ ఆఫీసర్ల పాత్రలు కూడా నవలలో కీలకం.

యాబైమూడు సంవత్సరాల వయసులో అకస్మాత్తు గా మరణించిన బెర్నార్డ్ స్కడర్ ఈ నవలను ఐస్లాండిక్ నుంచి ఇంగ్లీష్‌లోకి అనువాదం చేశారు. ఆయన ఐస్లాండిక్ సాహిత్యాన్ని ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖులలో ఒకడు. కాంటర్బరీలో జన్మించిన ఆయన, యార్క్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల సాహిత్యం అభ్యసించారు. 1977లో ఆయన రేక్జావిక్ విశ్వవిద్యాలయంలో ఐస్లాండిక్ భాషను అభ్యసించడానికి వెళ్లారు. ఆ తర్వాత ఐస్లాండ్ రివ్యూ, న్యూస్‌లో రిపోర్టర్‌గా, రాయిటర్ న్యూస్ ఏజెన్సీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. అనేక సంవత్సరాలు కవిత్వం రాస్తూ సాహితీ అనువాదకుడిగా కూడా ఆయన గొప్ప గౌరవాన్ని పొందారు.

ఆయ న అనువదించిన పురస్కారం పొందిన నవలల్లో థోర్ విల్‌హెల్మెసన్ రచించిన జస్టిస్ అన్‌డన్, గుడ్బెర్గర్ బెర్గెన్ రచించినది స్వాన్, ఎనార్ మార్ గుడ్‌మండ్‌సన్ రచించిన ఏంజెల్స్ ఆఫ్ ది యూనివర్స్, ఆర్నాల్డుర్ ఇంద్రిదాసన్ అవార్డు గెలుచుకున్న నవలలు ఉన్నాయి. ‘జార్ సిటీ’ తెలుగులోకి అనువాదం చేసిన వై.కృష్ణజ్యోతి గత ఇరవై ఏళ్ళుగా అనువాద రంగంలో ఉ న్నారు. ‘జార్ సిటీ’ ఆమె అనువాదం చేసిన మొ దటి క్రైమ్ ఫిక్షన్ నవల.


- హర్షణీయ బృందం

Tags

Next Story