నాయిన కొత్త గొంగడి

నాయిన కొత్త గొంగడి
X

నాయిన కొత్త గొంగడి గొన్నడు

పది దినాలయినా..

గొంగడి నాయిన భుజమెక్కలే ఎందుకో మరి.

వాకబు జేస్తే ఎరుకైంది

గొంగడి కడ ఎయ్యలేదని.

నాయిన కండ్లల్లో సుడిగుండంలా

నీళ్ళు దిరిగినయి గప్పుడు దెలిసింది

నాయినకు తాత యాదికొచ్చిండని.

ఎంత తెలివి తాతా నీకు

గొర్రె తుపుడతో దారం వొడికి గొంగండ్లకు కడలేస్తవు

నల్లని ఆకాశంలా సింగిడి ఇరబూసినట్టు

కడ ఎసిన గొంగడి కళ ఏరే ఉంటది

గా ఇద్దే నాకు జరంత జెప్పినవు

భుజంపై ఆత్మ బలమై తళుక్కున మెర్సిందీ గొంగడి

ఎండ, వాన, సలి నుంచి..

నిన్ను కాపాడుతున్నానని ముర్సిందీ గొంగడి

తరాల తరబడి మన జాతికి గుర్తుగా నిల్సిన గొంగడి

గీయల్లా ఏడుస్తుంది

నేనరుతో అక్కున జేర్సుకున్న గొంగడిని

కార్పొరేట్ కంబళి మింగేసింది

గీయల్లా నువ్వు లేవు

గొంగడి గూడా లేదు

నువ్వు జెప్పినఇద్దే మాయమైంది తాత

మాయమైంది..

- డా.ఆవుల రేణుక

Tags

Next Story