నాకోసం

For me
X

ఇక రావా నాకోసం

అంతా వసంత మాసమే అనుకున్నానే

వెన్నెలలో విహారమే అనుకున్నా

అనుకోని అతిథి వలె

ఒక్క మెరుపు మెరిసి మాయమైనావు

సందేహమేల కనుపాపకు

నీటి మత్తడి అడ్డు పడుతున్న సమయాన

వస్తావా? స్పర్శతో తడిమి అక్షరాలను పండించు కోనా! హృదయ స్పందన

నవనవలాడుతూనే ఉన్నది అనుమానం లేదు

అటు నుంచి వచ్చే

ప్రాణ వాయువు కోసమే ఈ ఎదురు చూపు

ఒక్కసారి కదిలించి చూడు

నీ తోనే నా ఆశలు, ఆశయాల ప్రేమ

దీపాలు వెలిగించుకోవాలనుకున్నా

పరిగె ఏరుకునే సమయాన నైనా

మొలకెత్తు తావేమోననే ఆశ

నీది నాది కలిపి కూడ బెట్టుకున్న

అపురూప నిధికి అడ్డు పడితే ఎట్లా

మళ్లీ తొలకరివై వస్తావని గ్రీష్మాలను

దాటిస్తావని స్తబ్దతను ఛేదించి

వెన్నెలను మించిన వెలుగులు పండిద్దామా

కళ్ళల్లో విరులు పూయించు మరి

వసంత నెల్లుట్ల

Tags

Next Story