గురజాడ అడుగు జాడలు

ఈ దయలేని కంటకావృత భయద సౌందర్య లోకంలో, మన కన్నా ముందు నడిచిన, అక్షరాల మైలు రాళ్ళను నాటి, దారి దీపాలై వెలిగిన రచయితలు, కళాకారులు, సృజనశీలురు అనేకమంది ఉన్నారని, వాళ్ళని మనం మరిచిపోకూడని గుర్తుంచుకోవాలి. చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుని, ఊరుకో కుండా చిరు దీపాలు వెలిగించిన, అక్షర రూపం దాల్చిన ఒకే ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లను కదలించగలదని నమ్మిన వాళ్ళు, అందుకు తమ జీవితాలను ఇచ్చేసిన వాళ్ళు ఉన్నారు. తమ కుంచెతో సప్తవర్ణాల లోకాన్ని పునఃసృష్టి చేసిన అద్భుత చిత్రకారులు ఉన్నారు. సప్తస్వర రాగాలతో, నాట్యంతో, శిల్పాలతో, జానపదాలతో సమస్త కళలతో మానవుల జీవితాల్ని వెలిగిం చిన వాళ్ళను మనం గుర్తుంచుకోవాలి. సామాజిక దురాచారాలను, అన్యాయాలను ప్రశ్నించి వాళ్ళు, వాటిని రూపుమాపేం దుకు పాటుపడిన వాళ్ళు ఎంతో మంది మన కన్నా ముందు కూడా ఉన్నారని గుర్తుంచుకోవాలి. అట్లా అనేక మంది సృజనకా రులు వాళ్ళ కాలం కన్నా ముందున్నందుకు నిందలు, శిక్షలు, వెలివేతలకు, నిషేధాలకు, మరణాలకు కూడా గురైనారని మనం గుర్తుంచుకోవాలి. ఆ నాటి స్థల, కాలాలను, వారి పరిమితులను దృష్టిలో పెట్టుకుంటూ వారందరినీ మరో మారు జ్ఞాపకం చేసుకునేందుకు ‘గుర్తుంచుకుందాం’ అన్న నూతన శీర్షికను మెహఫిల్ ప్రారంభిస్తున్నది. -ఎడిటర్ మెహఫిల్
గురజాడ వేంకట అప్పారావు తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగానికి దారులు వేసిన కవి, నాటకకర్త, సంఘసంస్కర్త. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి దగ్గరి రాయవరం గ్రామంలో ఆయన పుట్టాడు. విజయనగరం మహారాజా కళాశాలలో అధ్యాపకుడిగా, రాజాస్థానంలో పనిచేశాడు. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషలలో పాండిత్యం కలిగి, సమాజంలోని దురాచారాలను చూసి బాధపడి, తన రచనల ద్వారా సమాజంలో ఎంతో కొంత సంస్కరణకు కోసం ప్రయత్నం చేసాడు ఆయన.
గురజాడ రాసిన అత్యంత ప్రసిద్ధ రచన ‘కన్యాశుల్కం’. ఈ నాటకాన్ని1892లో పదర్శించారు. 1909 నాటికి నాటకపు సంపూర్ణ కూర్పు వచ్చింది. ఆ నాటి సమాజంలోని దురాచారాలైన, కన్యాశుల్కం, బాల్యవివాహాలు, వితంతు వివాహ నిషేధం, మూఢనమ్మకాలు, అవినీతి వంటి సమస్యలను హా స్యంతో, విమర్శతో ఎత్తి చూ పింది ఈ నాటకం. ఈ నా టకం వచ్చి వందేళ్ళకు పైగా అయినా గిరీశం, మధురవాణి వంటి పాత్రలు, వాటి స్వభావాలు ఇప్పటికీ మన సమాజంలో సజీవంగా ఉన్నాయి.
గురజాడ రాసిన దేశమును ప్రేమించుమన్నా అనే ప్రసి ద్ధ గీతంలో పాటలో ‘దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్’ అంటూ ఆయన దేశభక్తికి కొత్త అర్థం ఇచ్చారు. గిడుగు రామమూర్తితో కలిసి గురజాడ వ్యవహారిక భాషోద్యమానికి నాయకత్వం వ హించి, తెలుగు సాహిత్యాన్ని ప్రజలకు దగ్గర చేశారు.
గురజాడ కేవలం రచయిత మాత్రమే కాదు. స్త్రీ విద్య, వితంతు వివాహం, మానవతావాదం వంటి ఆలోచనలను ప్రోత్సహించిన సంస్కర్త. 53 సంవత్సరాల క్లుప్త జీవితంలోనే, తెలుగు సాహిత్యానికి ఆ కాలానికి కొత్త దిశ చూపి సాహిత్య ప్రపంచంలో ఉన్నతమైన గుర్తింపును సంపాదించుకున్నా డు. కొన్ని అంశాలలో ఇప్పటికీ ప్రాసంగికత కోల్పోని ఆయన రచన లు, ఈనాటికి ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉన్నాయి.
మెహఫిల్ టీం
-
Home
-
Menu
