గ్రామ దేవత-చారిత్రక పరిణామం

గ్రామ దేవత-చారిత్రక పరిణామం
X

రచయిత శ్రీ పద్మతో మెహఫిల్ గెస్ట్ ఎడిటర్ విమల ఇంటర్వూ.

(గతవారం తరువాయి )

ఆదిమ సమాజం నుంచి అమ్మ దేవతలు ఉండేవారని, అంటే మాతృస్వామ్య వ్యవస్థ ఒకప్పుడు ఉండేదని ఆ తరువాత సమాజం పితృ స్వామికి వ్యవస్థగా మారుతున్న సమయంలో వీళ్ళ ప్రాధాన్యత తగ్గి పురుష దేవుళ్ళు ముందుకు వచ్చారని, అలాగే ఈ పురాతన ఆడ దేవతలు ఇప్పుడున్న రూపంలో దుర్గా, పార్వతిగా మారారు, పురుషదేవతల ప్రాధాన్యత పెరిగింది అని అంటారు. దాని గురించి మీరు ఏమంటారు?

బహుశా అట్లా కాకపోవచ్చు. అ ది నమ్మను నేను మీరన్న విషయం కొంతమం ది స్కాలర్స్ పర్స్యు చేశారు. ఇలాంటి ఐడియాని, థియరీని కొందరు ప్రమోట్ చేశారు. ఉదాహరణకు సివిలిజేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు స్టెప్ బై స్టెప్పు ప్రోగ్రెస్ గురించి చెప్తారు. ఇప్పు డు అది కూడా ప్రశ్నిం చబడుతుంది. సివిలైజే షన్ అంటే ఏమిటి? ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఉదాహరణకి అపార్ట్ మెంట్లు, కాంక్రీట్ జంగల్ని నిర్మించటమా? దాన్నే మనం ప్రోగ్రెస్ అని అంటామా? సరే ఇదంతా వేరే చర్చ.. ఇప్పుడు మనం మాట్లాడు తున్న విషయానికి మళ్ళీ వద్దాం. అంటే మేట్రియార్‌కి నుంచి పేట్రియార్‌కి మారడం ఉండ వచ్చు. అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత కూడా మనదేశంలో కేరళ లాంటి ప్రాంతంలో మేట్రియార్‌కి ఉంది. వివిధ రకాల మేట్రియార్‌కిని చూస్తాం. ఉదాహరణకి కేరళలో చూద్దాం. అక్కడ ఎప్పుడూ ఒక మెయిల్ ఫిగర్ ఉంది. అది సో దరులు, మేనమామలు ఇట్లా. మేనమామ పిల్లల్ని పెంచి పెద్ద చే యడంలో ఉంటాడు. ఒకరు ఇద్దరు, ముగ్గురు ఇలా ఉండే తన సిస్టర్స్ పిల్లల సంరక్షణ చూస్తాడు. ఆస్తి ఎప్పుడు స్త్రీల పైనే ఉం టుంది. దాదాపు ఈజిప్ట్‌లో ఉండే ఫెరోస్ లాగా. అలాగే ఇతర రాజరికాల్లో కూడా. తల్లి, సోదరి ఇట్లా ఎవరైనా సరే, ఫార్మల్ గా ఫారో ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది.

ఆస్తి స్త్రీల ద్వారా సంక్రమించినా నిజానికి అది నామమాత్రమే అయింది. వాస్తవమైన కంట్రోల్ పురుషుడి చేతిలో ఉంటుంది. కేరళలో ఉన్న మేట్రియారికి కూడా అలాంటిదే. ఈ స్త్రీలకి చాలా స్వేచ్ఛ ఉంది. ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలన్నా వాళ్ళు పె ట్టుకోవచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్లకు ఇష్టమైన ఎవరితో నైనా లైంగిక సంబంధం పెట్టుకోవడానికి, వాళ్లకు ఇష్టమైన చో టికి ఎక్కడికైనా సరే వెళ్లడానికి అవకాశం ఉంటుంది అని అన్నా, వాళ్లు వాళ్ల సంప్రదాయాలను బట్టి ఎంపిక చేసుకుంటారు ఈ వ్యక్తినా, ఆ వ్యక్తినా అనేది. తండ్రి లేదా సోదరులు వీళ్ళు వ్యవ హారాలని నిర్ణయిస్తారు. ఇది కూడా బ్రిటిష్ వారి కాలం నాటికి మెల్లిగా నిలిచిపోయింది. స్త్రీల ఆస్తి హక్కుని గుర్తించలేదు. నా యర్స్ కేరళలో మెల్లిగా మెయిన్ స్ట్రీమ్‌లోకి రావాల్సి వచ్చింది. అలాగే మరో తరహా మెట్రియర్కి ఉదాహరణకి ద్రౌపతి, హిమాల యన్ ట్రైబ్స్, శ్రీలంకలో కూడా... అక్కడే, నేను రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు ఒక ధనిక కుటుం బాన్ని కలిసాను. ఆ ఇంటి అత ను వరండాలో ఉన్న ఫోటో చూ పిస్తూ, నాకు ఇద్దరు తండ్రులు అని చెప్పాడు. అది చాలా సాధా రణ విషయం కొన్ని చోట్ల అక్క డ. నా పొరుగున ఉండే కుటుం బంలో ఒక వ్యక్తి తనకి ఐదుగు రు తండ్రులు అని చెప్పాడు. అం టే ఒక స్త్రీ ఐదుగురిని పెళ్ళి చేసు కుంది. ఈ ప్రాక్టీస్ అక్కడక్కడ కనిపించినంత మాత్రాన అది ఆ స్త్రీలకి స్వేచ్ఛ ఉన్నట్లు కాదు. శ్రీలంకలో ఒక మహిళా ప్రొఫెస ర్ మా అమ్మమ్మ మా తాత గారి నే కాక, అతని సోదరుని కూడా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంది అని చెప్పింది.

ఈ పరిశోధనలో మీరు కనుగొన్నది ఏమిటి అనేది చెప్తారా?

చాలా ప్రాంతాలు తిరిగాను క్షేత్ర స్థాయి పరిశోధనలు చేశాను. ఆచార సాంప్రదాయాల్ని పరిశీలించాను. ఇ వన్నీ చేస్తున్నప్పుడు కూడా నా ప్రధానమైన ఫోకస్ గ్రామ దేవతలకి, ఇప్పుడున్న స్త్రీల పరిస్థితికి మధ్య ఉన్న లింక్ ఏమిటి? ఆ బ్రిడ్జ్ ఏమిటనేది. పరిశోధనలో చాలా విషయాలు ముం దుకు వచ్చాయి. అవన్నీ కూడా ఇం కా నేను రాయాలి. అమెరికా యూని వర్సిటీలో, నేను టీచ్ చేస్తూ ఉండడం, సిలబస్ తయారీ, అమెరికన్ స్టాండ ర్డ్స్‌కి అనుగుణంగా అక్కడ విద్యార్థు లకు బోధించాల్సి రావడం, మరి ఇత ర అంశాల పై కూడా రీసర్చ్ పేపర్స్ రాయడం ఇలాంటి అనేక పనుల ఒత్తిడి వల్ల కూడా ఈ పుస్తకం రావదానికి చాలా సమయం పట్టింది. గాడెసేస్ పైన ప్రతి యేటా కాన్ఫరెన్సులలో ఒకటి, రెండు పేపర్లు నేను ప్రజెంట్ చేస్తూనే వచ్చాను.

గాడెసేస్ మీది నా ఈ పరిశోధన, పేపర్ల ప్రజెంటేషన్ అమెరికన్లలో ఆసక్తిని కలిగించింది. ‘ఇన్వెంటింగ్ అండ్ రీ ఇన్వెంటింగ్ గాడ్సే స్’ అనే నా రెండో పుస్తకం వచ్చింది. దాంట్లో చాలా దేవతల గురించి చెప్పాను.దేవతల మీద పరిశోధన చేసిన స్కాలర్స్ నుండి అనేక వివరాలని నేను సేకరించాను. రిలీజియన్ స్పెషలిస్ట్ తో కూడా. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే నేను లాస్ట్‌కి ఏమిటి? అని అనుకున్నప్పుడు తెలుసుకోవాల్సింది ఆర్కియాలజీలో ఉందని, ఈ వైపుగా నేను పరిశోధన చేయాలనుకున్న. నేను రాసిన పేపర్లు బియ్యే గ్రాడ్యుయేట్ పిల్లలకి పాఠ్యాంశా లుగా కూడా పెట్టారు అమెరికాలో చాలా చోట్ల. అకాడమిక్ పుస్తకాలని ఆక్సఫర్డ్ బౌండ్ ఫామ్ లో ప్రింట్ చేస్తుంది చాలానే. ఈ పుస్తకం కూడా మొదట అలానే వచ్చింది. వాళ్లు పేపర్ బ్యాక్ ఎడిషన్ తీసుకొచ్చిన తర్వాత, ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చి, డిమాండ్ పెరిగింది. విద్యార్థులు కూడా పేపర్ బ్యాక్ ధర తక్కువ కాబట్టి కొనగలిగేవాళ్లు. ఈ పుస్తకం చాలా యూనివర్సి టీల్లో ఇప్పుడు సిలబస్‌లో భాగంగా ఉంది .అనేక యూనివర్సి టీస్ ఈ పుస్తకాన్ని బోధన కోసం యూస్ చేసుకున్నాయి. కొలం బియా యూనివర్సిటీ లో రిలీజియన్ ప్రొఫెసర్ పిలి క్రిమెజస్, హిందూ రిలీజియన్ స్పెషలిస్ట్ చెప్పాడు. అతనీ పుస్తకాన్ని తన క్లాసులో విద్యార్థులకు బోధించడానికి ఉపయోగించినట్టు. అతని దగ్గర పీహెచ్డీ చేసిన అతని స్టూడెంట్ ఒకరు మాతో పని చేయడానికి వచ్చినప్పుడు అతను మీ పుస్తకం గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పారు మా ప్రొఫెసర్ అన్నాడు.

ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? నేను రిటైర్డ్ అయ్యాను. స్టూడెంట్స్ కి గెస్ట్ లెక్చర్స్ ఇస్తాను అమెరికాలో. అలాగే నా ఇతర రీసెర్చ్ ప్రాజెకట్స్ పై వర్క్ చేస్తాను. గాడ్ విభీషణ, అతను రామాయణంలో ఉన్నవాడు. అలాగే అతడు ఎలా బుద్ధిస్ట్ దేవుడు అయ్యా డు ఈ విషయం పైన, అలాగే ఇంతకు ముందు చెప్పాను కదా. ఇద్దరు తండ్రు లు ఉండడం, దీనిపైన విశిష్టమైన ఫీల్ స్టడీ చేశాను. వైద్యంలో పరంపర ఎ లా వచ్చింది అనే విషయం పైన కూడా. ఇంతకుముందు చెప్పాను కదా మీకు. నాకు ఆసక్తి అనిపిస్తే ఒకదానించి ఒక దాని వైపు జంప్ చేస్తూ ఉంటానని అట్లా.. అట్లా ట్రెడిషనల్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ పైన కూడా అధ్యయనం చేస్తున్నాను. దీనిలో నా ఫోకస్ ఈ ప్రత్యేకమైన వైద్య విధానాలు, ఉదాహరణకి కొన్ని జబ్బులకు మందులు ఇవ్వడం, ఎముకల్ని సెట్ చేయడం వంటివి పరంపరగా చేస్తూ ఉండే కొన్ని ఇళ్ళు ఉంటాయి. జనం ఆ ఇళ్లకు వైద్యం కోసం వెళుతూ ఉంటారు. శ్రీలంక అంతటా నేను పర్యటించాను ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం. ఈ రెండు అంశాల పైన శ్రీలంకలో పరిశోధించాను. ఇప్పుడు ఈ రెండింటిని పుస్తకాలుగా తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను.

మరో సంగతి కొన్ని కొన్ని మార్లు, నేను కథలు కూడా రాస్తూ ఉంటాను. సో, ఆ పని కూడా నేను ఎప్పుడో మొదలు పెడతాను. ఎప్పుడన్నా పరిశోధనా పుస్తకాల కోసం రాస్తున్నప్పుడు అనేక కథనాలు ముందుకు వస్తాయి. పరిశోధనలో ప్రతి విషయానికి మనం ఆధారాల్ని, మూలాలను చూపించాల్సి ఉంటుంది. రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఏ పేజీలో ఎక్కడి, ఎక్కడ నుంచి ఏ విషయాన్ని తీసుకున్నామనే దానితో సహా. అందువల్ల ఈ పని కంటిన్యూస్ గానే చేయాల్సి ఉంటుంది. ఒక కథ రాసి ఆపేసి, మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ మొదలుపెడదాం దాన్ని అని అనుకునేలా పరిశోధన ఉండదు కదా. ఏమైనప్పటికీ నిజానికి ఆ స్వేచ్ఛ నాకు ఇష్టం.




Tags

Next Story