ఒట్టి చేతులతోనే రుణపడి వెళుతున్న

X
తొమ్మిది నెలలు మోసి, పురుడు పోసి, జన్మనిచ్చి
జీవితాన్ని నేర్పి ఎద మీద ఆడించి, లాలించి
పాలిచ్చిన తల్లికి పాదాభివందనాలు
తెలిపానని చెప్పండి
ఎప్పుడూ నన్నే చూస్తున్న గుంజకు కట్టేసిన
తెల్లావు దూడకు నేను కనిపించనని చెప్పకండి
పొలంలో నాతో సాగు చేసిన నాగలికి, జత ఎడ్లకు
చిగురు తొడుగుతున్న పంటకు
నేను మీతో పాటే ఆకలికి ఇక ఏడవనని చెప్పకండి
ఎండకు, వానకు, చలికి,కూడ నేను అలసి ఒరిగి
సేద తీరటానికి ఇక రానని చెప్పకండి
చిరుగాలికి చెప్పకండి
నాపై కారుతున్న చెమట వరదను
ఇట్టే పట్టుకుపోవాల్సిన అవసరం లేదని
మేఘానికి చెప్పకండి నాకు ఎండను కాసేందుకు ఇక రావద్దని
అరుగు మీద పిల్లలకు చెప్పకండి నాకోసం వెతకమని
నేను అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోని
నవయుగపు కాలాన్ని తెస్తందుకు వెళుతున్న
- గుండెల్లి ఇస్తారి
Tags
Next Story
-
Home
-
Menu
