ఉండీ లేనట్టు.. ఉన్నా లేనట్టు..

ఉండీ లేనట్టు.. ఉన్నా లేనట్టు..
X

కొండలంతే!

కళ్లకు దగ్గరగా

మనుషుల్లాగే దూరదూరంగా

ఇప్పుడున్న మనుషులకు

ఎప్పటినుండో ఉంటున్న దారులు చాలవు

కొత్త కొత్త దారుల వెంబడే

మనుషులు కొత్త కొత్తగానే

అడవులు, చెట్లు, కొండలు, నేల

ఆకాశం, గాలి, పక్షులు

మరికొన్ని సదా నూతనంగానే!

మాటలు మరచిన లోకంలో

టచ్ స్క్రీన్‌పై చేతివేళ్ల కదలికలుంటేనే

మనిషన్నట్టు

అంతర్జాలంలో లేకుంటే

మనిషెవరైనా అంతర్ధానమైనట్టే

తడి లేదు.. స్పందన లేదు

ప్రతి స్పందన లేదు, మనసే లేదు.

ఇప్పుడిది స్పర్శ తెలియని ప్రపంచం

దూరపు కొండలు నునుపు

పాఠం పాతదే

అర్థం మాత్రమే మారినట్టుంది

- పలమనేరు బాలాజీ

Tags

Next Story