నేటి సామాజిక వాస్తవాలకు పదునైన అద్దం శ్రీశ్రీ ‘చేదుపాట’

చేదుపాట
ఔను నిజం, ఔను నిజం
ఔను నిజం, నీవన్నది,
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, నిజం!
లేదు సుఖం, లేదు సుఖం,
లేదు సుఖం జగత్తులో!
బ్రదుకు వృథా, చదువు వృథా,
కవిత వృథా! వృథా, వృథా!
మనమంతా బానిసలం,
గానుగలం, పీనుగలం!
వెనుక దగా, ముందు దగా,
కుడి యెడమల దగా, దగా!
మనదీ ఒక బతుకేనా?
కుక్కల వలె, నక్కల వలె!
మనదీ ఒక బతుకేనా?
సందులలో పందులవలె!
నిజం సుమీ, నిజం సుమీ,
నీవన్నది నిజం సుమీ!
బ్రతుకు ఛాయ, చదువు మాయ,
కవిత కరక్కాయ సుమీ!
లేదు సుఖం, లేదు రసం,
చేదు విషం జీవఫలం!
జీవఫలం చేదువిషం,
చేదు విషం, చేదు విషం!
ఔను నిజం, ఔను సుమా,
ఔను నిజం నీవన్నది!
నీవన్నది, నీవన్నది,
నీవన్నది నిజం, నిజం!
కవిత్వమొక తీరని దాహం.. శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) 1910 ఏప్రిల్ 30వ తేదీన జన్మించాడు. అనారోగ్యంతో 1983 జూన్ 15న మరణించాడు. ప్రముఖ విప్లవ కవిగా ప్రసిద్ధుడు.సాంప్రదాయ, ఛందోబద్ధ కవిత్వాన్ని ధిక్కరించి, తన అక్షరాల ను భూమార్గం పట్టించి, తెలుగు సాహిత్యంలో, సమాజంలో తన రచనల ద్వారా భూకంపాలు సృష్టించిన వాడు. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షుడిగా పనిచేసాడు. శ్రీశ్రీ కవిత్వ సంకలనం మహాప్రస్థానం అత్యంత ప్రజాదరణ పొందిన రచన లలో ఒకటి. శ్రీ శ్రీ సినీరంగలోనూ పాటల, మాటల రచయితగా కూడా పనిచేసేశాడు. ఆ రంగంలోనూ అద్భుతమైన అనేక పాటలను రాసాడు.
శ్రీ శ్రీ రచనలు
మహాప్రస్థానం, ప్రభవ, ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం, సిరిసిరిమువ్వ, ప్రాస క్రీడలు, లిమరిక్కులు (సిప్రాలి), మూడు యాభైలు, చరమరాత్రి,1 + 1 = 1 రేడియో నాటికలు, వారం వారం, మన గురజాడ, జాబులు, చైనాయా నం, సిప్రాలి, వ్యూలు, రివ్యూలు, ప్రజా, అనంతం
-(శ్రీశ్రీ స్వీయ చరిత్ర)
శ్రీ శ్రీ
1990లలో అనుకోకుండా నా కంటబడిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసింది. ముఖ్యంగా అందులోని ‘చేదుపాట’ నా నూనుగు మీసాల వయసులో ఆలోచనలను తట్టిలేపి, అభ్యుదయం వైపు న డిపించిం ది. ఈ లోకంలోని కఠిన వాస్తవాల ను, దోపిడీని, మోసాన్ని శ్రీశ్రీ ఇందు లో పదునైన పదాలతో ఎండగట్టాడు. మనిషి స్వేచ్ఛను కోల్పోయి యంత్రాల్లో భాగమై ‘గానుగెద్దు లా’, చైతన్యం లేని ‘పీనుగులా’ మారాడనే కవి ఆవేదన అక్షరాల్లో కనిపిస్తుంది. ‘ముందు ద గా, వెనుక దగా’ అంటూ సామాన్యుడు ఎదుర్కొనేవంచనను, జంతు ప్రాయమైన బతుకుల ను ఆయన నిశితంగా విమర్శించాడు. సమా జం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు చదువు, కవి త్వం వృథా అని, జీవితం ఒక ‘చేదు విషం‘ అ ని కుండ బద్దలు కొట్టాడు. ఈ కవితలో శ్రీశ్రీ చూపిన నిరాశ నిజానికి ఒక నిశ్శబ్ద విప్లవం. వ్యవస్థలోని కుళ్ళును అంగీకరించడమే మార్పుకు మొదటి మెట్టు అని ఆయన నమ్మాడు. దశాబ్దాల క్రితం రాసినా, నేటి వర్తమాన సామాజిక వాస్తవాలకు ఈ కవిత ఒక పదునైన అద్దంలా నిలుస్తూనే ఉంది.
హన్మకొండ జిల్లా, వేలేరు గ్రామానికి చెందిన బిల్ల మహేందర్ ఉపాధ్యాయు డిగా విధులు నిర్వహిస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రభావితమై ఇప్పటివరకు ఎనిమిది కవితాసంపుటాలతో పాటు తన సంపాదకత్వంలో వివిధ సమకాలీన అంశాలపై నాలుగు కవితా సంపుటాలను తెలుగు సాహిత్యానికి అందించాడు. కవిత్వం తో పాటుగా దివ్యాంగుల హక్కులు, ఆత్మగౌరవం కోసం కృషి చేస్తూనే, విద్యఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికోసం పాటుపడుతున్నాడు.
- బిల్ల మహేందర్
9177604430
Tags
-
Home
-
Menu
