లిటిల్ ధియేటర్ కొన్ని అనుభవాలు

లిటిల్ ధియేటర్  కొన్ని అనుభవాలు
X

(గత సంచికతరువాయి)

స్విస్ నాటక రచయిత Friedrich Durren matt రాసిన In the Matter of J.Robert Oppenheimer నుంచి కొన్ని భాగాలు కూడా లిటిల్ థియేటర్ బృందం రీడింగ్ చేసింది. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ గా ఆయన్ని పిలుస్తారు. ఇక్కడ ’మాక్స్ ముల్లర్ భవన్’ డైరెక్టర్ గారి భార్య ఈ రీడింగ్ సెషన్ ఏర్పాటు చేయించారు. బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ స్టడీస్ లో కూడా ఇదే ప్రదర్శన ఇచ్చారు. ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుందట! “హైదరాబాద్‌లోని ఇఫ్లూ (English and Foreign Languages University)లో కూడా ఈ ప్రదర్శన ఇచ్చాం. ఇఫ్లూకి బ్రిటీష్ కౌన్సిల్ వాళ్లు కొందరు ప్రొఫెసర్స్‌ని పంపేవాళ్లు. అందులో John Irving అని ఒక ప్రొఫెసర్ ఉండె. షేక్సియర్ వర్స్ స్కాలర్. జాన్ ఇర్వింగ్ తాత Henry Irving. ఆయన ‘The Henry Irving Shakespeare’ పేరిట ఎనిమిది సంపుటాలు రాశారు. అంతటి మహనీయుడి మనవడైన John Irving కూడా మాతో కలిసి In the Matter of J.Robert Oppenheimer రీడింగ్ చేశాడు” అని మరో జ్ఞాపక పుట నా ముందు తెరిచారు శంకర్ మెల్కొటె.

ఇలాంటిదే మరో సందర్భం. శాంతా రామేశ్వరరావు ఒక కథ రాశారు. అచ్చవడానికి ముందే ఆ కథని శంకర్ చదివారు. ‘ద కాన్సర్ట్ (The Concerts) పేరుతో రాసిన ఆ కథ ఆయనకు చాలా నచ్చింది. ‘లిటిల్ థియేటర్’ తరపున దానిని ప్రదర్శిస్తానని ఆమెని అడిగితే “నీ మీద నమ్మకం ఉంది. చేయి” అన్నారట. ఆ కథ ఆమె ఫ్యామిలీలో నిజంగా జరిగిన ఘటన. మహారాష్ట్రలోని ఓ గ్రా మీణ ప్రాంతంలో ఒక కుటుంబం ఉంటుంది. భా ర్య, భర్త, ఇద్దరు పిల్లలు. అమ్మాయి, అబ్బాయి. వాళ్లు చిన్నపిల్లలు. ఆ అబ్బాయికి క్యాన్సర్ ఉందని నిర్ధారణ అవుతుంది. ఆ అబ్బాయి చదువులో, ఆటల్లో చురుకైనవాడు. కానీ క్యాన్సర్! ఆ ఫ్యామిలీ మొత్తం మ్యూజిక్ లవర్స్. కచేరీ చూడ్డానికి ఆ తండ్రి రెండు టిక్కెట్లు కొంటాడు. కొడుకు రాలేడు గనుక తల్లిని తోడుగా ఉంచుతారు. తండ్రీ ‘కూతుళ్ళు కచేరీకి వెళతారు. కచేరీ ముగిసిన తర్వాత చూస్తే అతనికి తన కూతురు కనిపించదు. ఆడిటోరియంలో ఎక్కడ వెతికినా ఫలితం ఉండదు. చివరికి స్టేజ్ మీదకు వెళ్లి తెర వెనుక చూస్తే ఆ పాప పండిట్ రవిశంకర్ తో మాట్లాడుతూ కనిపిస్తుంది.

“మా అన్నయ్యకి ఆరోగ్యం బాగోలేదు. బాగుంటే తప్పక వస్తుండె. తనకి సంగీతమంటే పిచ్చి.. తనకి క్యాన్సర్‌” అని చెప్తూ ఉందట. అది విన్న రవిశంకర్ జాకీర్ హుసేన్ వైపు తిరిగి “ఉస్తాద్ ఏమంటావ్‌” అన్నారట. అతను “ఛలో” అని బదులిచ్చాడట. తర్వాత రోజు వాళ్లిద్దరు టాక్సి కట్టుకుని ఆ చిన్న ఇంటికి వస్తారు. ఆ పిల్లవాడి కోసం గంటసేపు కచేరీ చేస్తారు. అతని మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. కొనాళ్లకి ఆ బాబు చనిపోతాడు. ఇదీ ‘ద కాన్సర్ట్’ స్టోరీ సంక్షిప్తంగా. “ఈ కథని కూడా లిటిల్ థియేటర్ ఎంతో బాగా పెర్ఫార్మ్ చే సింది. ప్రముఖ ఎకనమిస్ట్ రాజా అంగార ఇందు లో పాల్గొని సితార్ ప్లేచేశారు. మంచి స్పందన వ చ్చింది” అంటూ ఆ మొత్తాన్ని కళ్లకు కట్టినట్టు చె ప్పుకొచ్చారు శంకర్ మెల్కొటె. అనంతర కాలంలో పబ్లిష్ అయిన ఈ కథని మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ 10వ తరగతి ఇంగ్లీషు పాఠ్యాంశంగా స్వీకరించడం మరో ఆసక్తికర అంశం.

ఇక ఇటీవలి సంగతికి వస్తే... ఈ మధ్య జర్మన్ కల్చరల్ సెంటర్ గోథెజెంత్రం (goethe-zentrum)లో పర్యావరణం గురించి ఒక రీడింగ్ చేశారు. దీంట్లో కూడా మ్యూజిక్ ని బాగా ఉపయోగించారు. కోల్ కతాలో జూనియర్ డాక్టర్ ని రేప్ చేసి చంపిన ఘటనకి నిరసనగా జాదవ్ పూర్ యూనివర్శిటీ విద్యార్ధులు స్ట్రీట్ డాన్స్ మాదిరిగా ఒక ప్రొటెస్ట్ నిర్వహించారు. దీనికి భూపేన్‌హజారికా రాసిన O Ganga Behti Ho KYun అనే పాటని ఉపయోగించారు. ఆ వీడియోతో రీడింగ్ మొదలుపెట్టారట. వారు ఎంచుకున్న సబ్జెక్టుకి సూటయ్యే పాట అది. ఆ తర్వాత పర్యావరణం మీద అయిదారు పీసెస్ చదివారట. చివర్లో అమెరికన్ ఫోక్ సింగర్ Joanbaez వర్షం గురించి పాడిన WHAT HAVE THEYDONE TO THE RAIN అనే పాటతో ముగించారట. దీనికి కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చిందని శంకర్ చెప్పారు. తమకి తటస్థపడే గురించి ఆయన వివరిస్తూ “మమ్మల్ని పురికొల్పే అంశాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా ప్రసిద్ధ రచయిత హైదరాబాద్ వస్తే ఆ రచయిత వర్‌క్స్ చదువుతాం.

ఎవరిదైనా వర్ధంతి వస్తే వారి రచనలు చదువుతాం. వరల్డ్ లిటరేచర్ డే వచ్చిందనుకోండి. లేదా ఏదైనా కొత్త మ్యాగజైన్ విడుదలైనా మాకు సందర్భమే” అన్నారు. ఇందుకు సంబంధించిన ఒక అంశాన్ని ప్రస్తావించారు కూడా. ITC గ్రూపు ఒక మ్యాగజైన్ తెస్తుంటుంది. ఒకసారి వాళ్లు సంగీతం గురించి ఒక ప్రత్యేక సంచిక తెచ్చారట. అందులోంచి మూడు కథలను ఎంచుకుని అదే హోటల్లో రీడింగ్ చేశారట. సంగీత విద్వాసురాలు మాలినీ రజుర్కర్ ముందు వరుసలో కూర్చుని తాళం వేశారట. “ఆ దృశ్యం మరచిపోలేనిది..” అన్నారాయన ఎంతో తృప్తిగా. ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ స్ఫూర్తితో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో కొందరు రీడింగ్స్ చేస్తున్నారిప్పుడు. శంకర్ మెల్కొటె అండ్ కో చూపిన మార్గానికి ఇది అర్ధవంతమైన కొనసాగింపుగా భావిస్తూ ‘ద లిటిల్ థియేటర్ హైదరాబాద్’ కృషికి మనసారా అభినందనలు తెలియచేద్దాం.

- ఒమ్మి రమేష్ బాబు

Tags

Next Story