శత్రువు

21వ రోజు
వాతావరణం నిర్మలంగా ఉన్నప్పుడు
నా గడ్డం పెరిగినపుడు
నేను సూర్యుని వంక చూసి
తల పంకించాను
ఎందుకంటే ఈ ఒక్క పనే
ఆ సమయంలో నేను చేయగలిగేది
ఓ వ్యక్తి నగరానికి మరో చివర
నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడు
ఓ సైకిల్ ఎండలో నిలబడి ఉంది
ఓ సవాలులా
నా ఊపిరితిత్తులకు
నా భాషలోని పూర్తి వాక్య నిర్మాణానికి
మనిషి అరుపులు నాకు
వింతగా అనిపిస్తున్నాయి
నేను నా కాలంలో
అందరికంటే బలమైన వ్యక్తి
చీకటిలో నుండి దూకి
అగ్గిపెట్టెలోకి ప్రవేశించడాన్ని చూశాను
నా ఇబ్బంది ఏమిటంటే
నేను విషయాలు ఎరుగుదును
విషయాల గురించి తెలుసుకోవడం
మనిషి కండరాల నిరంతర యుద్ధం
దానికోసం ప్రతిసారీ
ఒక్కో కొత్త సరిహద్దును వెతకాల్సి వస్తుంది
శత్రువు ఎక్కడా కనబడలేదు
కనీసం రేడియో కూడా ఎప్పుడూ
తన పేరును ప్రస్తావించదు
ఉప్పు.. నీరు..
ఆ రెండు పదాలే నా దగ్గరున్నాయి
మూడోది ఎప్పుడూ తన వద్దే ఉంటుంది
అయినా ఎంత ఆశ్చర్యం
అన్ని సదుపాయాలు ఉన్న
ఇటువంటి సమయంలో
చరవాణిలో ఏ అంకెల ద్వారా కూడా
తనని కలిసే వీలులేదు
- కేదార్నాథ్ సింహ్
-మూలం: ‘దుశ్మన్’ హిందీ కవిత, రచయిత ప్రముఖ హిందీ కవి, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత
అనువాదం: రాధకృష్ణ కర్రి
Tags
-
Home
-
Menu
