పొదిగిన మౌనం

X
ఆ కాస్త ఆనందం కూడా వద్దా నాకు?
రాత్రులన్నీ -తీవ్ర వేదనల్లోకి
నెట్టేయబడతాను
ఉదయాల కల్లా -
ఒక కొత్త ఉత్సాహంతో
మళ్లీ మేల్కొంటాను
బాధలోనూ తీపి ఉంటుందనీ
ఆ తీపే అలవాటైతే -
విరహ వేదనలు కూడా
ప్రేమ కావ్యాల్లా అలరారుతాయనీ
అనుభవాల్లోకి వచ్చాక గానీ తెలియదు
అది, లోలోన మంటై పుట్టి
ఇప్పుడు చిగురు తొడిగిన
మోదుగు పూల వనమై విరబూస్తోంది
కాలంతో సహా -సంబంధం లేనట్టే
- బాలాజీ పోతుల
Tags
Next Story
-
Home
-
Menu
