గ్రామ దేవత- చారిత్రక పరిణామం

గ్రామ దేవత-  చారిత్రక పరిణామం
X

రచయిత శ్రీ పద్మతో మెహఫిల్ గెస్ట్ ఎడిటర్ విమల ఇంటర్వూ

డాక్టర్ శ్రీ పద్మ దక్షిణాసియా సాంస్కృతిక చరి త్ర పరిశోధకులుగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినవారు. మన తెలుగువారు. దాదాపు ఇరవై ఏళ్లపాటు ఆవిడ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాలలో క్షేత్రస్థాయి పర్యటనలు, చేసి, గ్రామ దేవతల ఆవిర్భావము, చారిత్రక పరిణామాలపై, లోతైన అకాడమిక్ పరిశోధన చేశారు. ఈ చరిత్ర పరిశోధన, విశ్లేషణ ఈనాటి సమాజంలోని అనేక ప్రశ్నలకు కూడా సమాధానాలను అందించేదిగా ఉంది. డాక్టర్ శ్రీ పద్మ గ్రామదేవతలపై ’‘Vicissitudes of the Goddess : Reconstructions of the Gramadevata in India’s Religious Traditions’ అనే పుస్తకాన్ని రాయగా, 2013లో ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ దీనిని ప్రచురించింది. ఇటీవలే ఈ పుస్తకాన్ని తెలుగులోకి ‘గ్రామ దేవత-చారిత్రక పరిణామం’ అనే పేరుతో అరుణ ప్రసాద్ అనువదించగా, అజు పబ్లికేషన్ ప్రచురించింది. హైదరాబాద్ నగరంలోని సాంస్కృతిక ఆవరణ లామకా న్‌లో పుస్తకావిష్కరణ జరిగింది. ఆ సందర్భం గా హైదరాబాద్ నగరానికి వచ్చిన శ్రీ పద్మతో మెహఫిల్ గెస్ట్ ఎడిటర్ విమల సంభాషిం చారు.

శ్రీ పద్మ గారు మీరు ఒక గొప్ప పుస్తకాన్ని తెలుగు వాళ్లకి అందించారు. మీ నేపథ్యం గురించి కొంచెం వివరిస్తారా?

నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న, మా తాతగారు అందరూ వ్యవసాయ కుటుంబం వాళ్ళే. మేము మా నాయనమ్మ ఇంట్లో పెరిగాము. ఆమెకి మా నాన్నగారు ఒక్కడే కొడుకు. నానమ్మకి అన్నదమ్ములు ఎవరూ లేరు. మా నానమ్మ తన తం డ్రి ఇంట్లోనే ఉండింది. ఆయన కట్టించిన ఇంట్లోనే మేమంతా ఉన్నాము. మొన్నటివరకు కూడా. చిన్న విలేజ్‌లో పెరిగాను నేను. మూడేళ్లప్పుడు ఎందుకు అనుకున్నారో తెలియదు కానీ నన్ను అప్పుడే మా మేనత్త గారి ఇంటికి పంపించారు. మా నాయనమ్మ స్కూల్‌కి ఏమి వెళ్ళలేదు కానీ, అక్కడ, దడి పక్కన నలబడి వింటూ నేర్చుకున్నారట. ఆమె కావ్యాలు, భారత భాగవతాలు ఎప్పుడూ చదువుతూ ఉండేది. పద్యాలు కూడా రాసింది చందస్సు తోటి. చాలా తెలివి ఉన్న మనిషి ఆమె. తెలివి ఉండటమే కాదు, ఆమెకి తనకు చాలా తెలివి ఉందని కూడా తెలుసు. చాలా క్రిటికల్‌గా ఉండేది. నిజంగా ఆమె ఒక ఫోర్స్. ఆమెకి, ఆమె స్నేహితులకి నేను ఫిలాసఫీ చదివేదాన్ని. మా అమ్మతో కూడా ఆమె చదివించుకునేదట నాకన్నా ముందు.

అయితే మీరు చిన్నప్పటినుంచి పురాణాలు, సాహిత్యం ఇలాంటి వాతావరణం మధ్య పెరిగా రన్నమాట. మీరు ఎక్కడ చదువుకున్నారు?

అవును అలాంటి వాతావరణమే ఉండింది నా చుట్టూ. నేను ఇట్లా రాయడం వెనుక కూడా ఈ వాతావరణమే ఉంది అని నా గట్టి నమ్మకం. మామూలు స్కూల్స్‌లో, గవర్నమెంట్ స్కూల్స్‌లో మైలవరంలో చదువుకున్నాను. గుడ్లవల్లేరులో ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్ చదివే నాటికి నిజానికి నాకు అంత వయసు లేదు. నేను ఇంటికొచ్చేసరికి నా పెళ్ళికి ఐదు రోజులే సమయం ఉందని తెలిసిం ది. నా పెళ్లికి మాత్రం నా స్నేహితుల్ని ఎవరిని పిలవలేదు. ఎందుకంటే ఆ పెళ్లి మా ఇంట్లో జరగలేదు. పెద్దవాళ్లు డిసైడ్ చేసుకుంది అంతా. వాళ్లు నాకు చెబుదామని అనుకోలేదు. సెలవులకు వచ్చినప్పుడు నన్ను చూపించారు. అప్పుడు నేను ఏడ్చా ను. ఎందుకు నన్ను చూపిస్తున్నారు అని. పెళ్లినాటి కి నాకు 15 ఏళ్లు. 1972లలో నా పెళ్లి జరిగింది. 1990లలో కూడా ఇంకా బాల్య వివాహాలు జరగడం చూశాను మా గ్రామం వచ్చినప్పుడు.

అయితే మీది చైల్డ్ మ్యారేజ్ అన్నమాట?

చైల్డ్ మ్యారేజ్ అని చిన్నగా అంటున్నారా. అవును. నాకు చాలా గట్టి భావాలు ఉండేవి. కానీ నాకు ఏం చేయాలో అప్పుడు తెలియలేదు. అప్పుడు నేనేం ఆ లోచిస్తున్నాను అనేది ఎవరూ పట్టించుకోలేదు. ఏదేమైనప్పటికీ, నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. అయినప్పటికీ చదువు కంటిన్యూ చేశాను. మెడిసిన్ చదవాలని కోరిక ఉండేది. మా నాయనమ్మ అంటే నాకు ఎడరేషన్ ఉన్నది బట్ సేమ్ టైం, ఇప్పుడు నేను రీసెర్చ్ చేసి ఉన్నాను కదా, నా గురించి కూడా నే ను క్రిటికల్ గానే ఉంటాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ విషయమే కాదు, ఇంకా అనేక విషయాలపై కూడా, నన్ను నేను జడ్జ్ చేసుకోవడం కూడా ఎక్కువే. అది అలవాటైపోతుంది. ప్రతి దాన్ని ఎనలిటికల్‌గా చూస్తాము. అన్నింటినీ బాగా విశ్లేషణ చేస్తాం. మా నాయనమ్మని కూడా నేనే ఎక్కువ ఎనలైజ్ చేసాను. ఏ పుస్తకం రాసినా చెప్తా ను.

నా ఇన్‌స్పిరేషన్ మా నాయనమ్మ నుంచి వ చ్చిందని. ఈ పుస్తకంలో కూడా చెప్పాను. నా పెళ్లి తర్వాత కూడా నేను చదువు కంటిన్యూ చేశాను. మొదట బిఎ హిస్టరీ చేశాను. అప్పుడు వైజాగ్‌లో, చిన్న వాల్తేరులో ఉన్నాము. ఆంధ్ర యూనివర్సిటీ లో అప్లై చేశాను. బిఎ స్పెషల్ తెలుగు, హిస్టరీ చేశా ను. నేను ఎంఎ, ఆర్కియాలజీ, ఆ తరువాత ఎంఎ హిస్టరీ చేశాను. దీని తర్వాత పిహెచ్‌డి కూడా చేశా ను. టెంపుల్స్ మీద రీసెర్చ్ చేశాను. టెంపుల్ ఆర్ట్ లో కాస్ట్యూమ్స్ అండ్ ఆర్నమెంట్స్ మీద చేశాను. టెంపుల్స్‌లో స్రీలు, పురుషులు సెక్యులర్ ఫిగర్స్‌గా ఉండేవాళ్ళు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అనేక రకాలైన హెయిర్ స్టైల్స్ చూశాను గుళ్ళలో. మిడీవల్ టైమ్స్‌లో మగవాళ్ళు, ఆడవాళ్లు ఎంతో ఆర్టిస్ట్‌గా శిరోజాలు అలంకరించుకునేవారు. దీనిపైన రాసిన పుస్తకం ఆగం కళా ప్రకాశన్, ఢిల్లీ వారు వేశారు. అది నా ఫస్ట్ రీసెర్చ్ పుస్తకం.

ఆ తరువాత నాకు యూజీసీ రీసెర్చ్ అసోసియేట్ ఫెలోషిప్ వచ్చింది. మా ఆంధ్ర యూనివర్సిటీలోనే. 1990 ప్రాంతంలో వచ్చింది. 3+2 ఇయర్స్ ఇస్తా రు ఫెలోషిప్. 1994లో హార్వర్డ్ ఫెలోషిప్ వస్తే వె ళ్ళాను నేను పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్, విసిటింగ్ ప్రొఫెసర్‌గా. అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీలో కూడా నేను టీచ్ చేస్తున్నాను. మా డిపార్ట్‌మెంట్ లోనే కొన్ని క్లాసులు ఇస్తే అవి టీచ్ చేసేదాన్ని. 1989కి నా పిహెచ్‌డి పూర్తి చేశాను. ఆ తరువాత ఒక సంవత్సరం యూనివర్సిటీలోనే సెంటర్ ఫర్ మెరైన్ ఆర్కియాలజీలో పరిశోధన చేశాను. దాంట్లో నా పని వివిధ ప్రాంతాల్ని ఎక్స్‌ప్లోర్ చేయడం. ఓల్డ్ పోర్ట్స్‌ను కనుగొనడం, వాటికి బుద్ధిజంతో ఉ న్న సంబంధం చూడడం. బుద్ధిస్టు స్థూపాలు సాధారణంగా వాణిజ్య మార్గాల అంతట ఉండేవి. వాణి జ్యం మధ్యయుగాలలో దక్షిణ భారతదేశంలో ఎలా ఉండేది, కోస్తా తీర ప్రాంతాలలోని పోర్టుల వద్ద పరిశోధించడం సులభంగా ఉంటుంది కొంత. ఒక ఏడాది పాటు ఈ పరిశోధన చేశాను. ఉమెన్స్ రిలీజియన్ ప్రోగ్రాంలో భాగంగా నాకు ఫెలోషిప్ వచ్చింది. నేను ప్రత్యేకించి అమ్మ దేవత అంశాన్ని నా పరిశోధన కోసం ఎంచుకున్నాను.

బుద్ధిజంపైన చేస్తున్న పరిశోధన విమెన్ గాడ్స్, గ్రామ దేవతలపైకి మళ్ళడానికి ప్రధానమైన కారణం ఏమిటి?

‘స్త్రీల స్థానం సమాజంలో అంత తక్కువగా ఎందు కు ఉంది? అదే సమయంలో కాళీ, దుర్గ వంటి దేవతలకు అంత ఉన్నత స్థానం సమాజంలో ఎందుకుంది?’ ఈ విషయాన్ని నేను పదేపదే ఆలోచించా ను. నన్ను నేను ప్రశ్నించుకున్నాను. స్త్రీ దేవతల చరిత్రను పరిశీలించటం మొదలుపెట్టాను. నన్ను నేను కూడా అనలైజ్ చేసుకున్నాను. ఎందుకు నేను ఇట్లా ఒక టాపిక్ నుంచి మరో టాపిక్‌కి జంప్ చేస్తున్నా ను అని. నేనెప్పుడూ క్లిష్టంగా ఉండే విషయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటాను. అట్లా ఎందుకు చేస్తానో నాకు కూడా తెలియదు. ఏదైనా ఒక అం శంపైన మాట్లాడమన్నా, ఇంతకుముందే నేను ఆ విషయం పైన రాసి ఉన్నా, పేపర్ ప్రజెంట్ చేయాలన్నప్పుడు, ఆల్రెడీ దానిపైన మాట్లాడే ఉన్నప్పటికీ అనేక విషయాలు తెలిసినా, ప్రతిసారి నేను కాంప్లికేటెడ్‌గానే ఆలోచిస్తాను. వేరు వేరు కోణాల నుంచి, రకరకాల డీవియేషన్స్‌ని, ఇది ఇట్లా ఎందు కు ఉంది, అది అట్లా ఎందుకు లేదు అంటూ.. వచ్చే ఈ ఆలోచనలను నేను ఆపలేను. అది ఒక ప్రాబ్లం కూడా ఏమో నాకు తెలియదు కానీ, ఆ పని తెలిసి కూడా చేస్తూ ఉంటాను. అందరూ చేస్తున్న అదే పనిని చేయాలనిపించదు. కొత్తగా చేద్దామని అనుకుంటాను. అయితే అది మనల్ని కష్టమైన పరిస్థితుల్లో కూడా నెడుతుంది. అప్పటికే వేసి ఉన్న దారుల్లో కంటే కొత్తదారుల్ని, మన సొంత దారిని వేయడం, ఒక ప్రత్యేకత కూడా.

పురుష దేవుళ్ళ మీద జరిగినంత పరిశోధన విమె న్ గాడెసిస్ మీద జరిగినట్టు లేదు. రీసెర్చ్‌లోనూ మెయిల్ ఓరియంటెడ్ పరిశోధనలు ఉంటాయా? మహిళా దృక్పథంతో ఈ అంశంపై పరిశీలన చేయాలి అని మీరు అనుకున్నారా?

ఉన్నది అలాంటి దృక్పథం. అందుకే నేను ప్రత్యేకిం చి ఈ సబ్జెక్టును ఎంచుకున్నాను. పరిశోధన చేయాలంటే చాలా అంశాలే ఉంటాయి. మతము, మహిళలు వంటి అంశాలు కూడా ఉంటాయి. నాకెందు కో అందరూ చూసే అంశాలని ఎంచుకోవాలని అ నిపించదు పరిశోధనకి. మళ్లీ నన్ను నేను ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో పెట్టుకుంటాను (నవ్వు) సులభమైన దారిని ఎంచుకోను.

ఇది మీ స్టయిల్ కావచ్చునేమో..?

అవును మీరు అన్నది కరెక్ట్. నా దారిని నేను స్వ యంగా వెయ్యాలి అని అనుకుంటాను. అందుకే ఈ అంశాన్ని ఎంచుకున్నాను. అమెరికాలో కరుకు లం మారుతూ ఉంటుంది. ఏళ్ల తరబడి అదే పాత సిలబస్ కాకుండా, కొత్త విషయాలు, కొత్త పరిశోధనలు మన అధ్యయనంలో రావాలి. అప్పుడే విద్యార్థులు ఇప్పుడు జరుగుతున్నది ఏమిటో తెలుసుకోగలుగుతారు. అవును ఆ కాలంలో కూడా గొప్ప స్కా లర్స్ ఉన్నారు. పరిశోధన చేశారు. కొన్ని తరాలుగా ఎలాంటి పరిశోధనలు జరగలేదని మనం అనలేం వాళ్ళు చేశారు. అమెరికా వెళ్ళాక, అక్కడ రీసెర్చ్ చూశాక నాకు అర్థమైంది

మన విద్యా వ్యవస్థలో, కరికులం రూపొందించుకో వడంలో, పరిశోధనలో ఎక్కడో స్టాగ్నేషన్ వచ్చింది అనుకుంటాను.. అంతే కదా?

అవును. అలాంటి స్థితి వచ్చింది. కానీ బ్రిటిష్ వా ళ్ళ విద్యా విధానం పూర్తిగా తప్పని కూడా అనడం లేదు. కొత్త పరిశోధనలు జరగాలి. సరే మళ్లీ మనం మనం మాట్లాడుతున్న విషయంలోకి వద్దాం. అమెరికా వెళ్ళాక అక్కడ ఒక టీంతో పనిచేస్తున్నప్పుడు చాలా ఆలోచించాను. 16వ శతాబ్దంలో మీరాబా యి, అలాగే ఆండాళ్, అక్క మహాదేవి ఇలాంటి భక్తురాళ్ళు అయిన మహిళలు ఎందుకు ఇలాంటి మార్గం ఎంచుకున్నారు. అక్కమహాదేవి అయితే నగ్నంగా తిరిగింది. దేనికీ కట్టుబడలేదు. కఠినం గా, మారకుండా ఉన్న రూల్స్ అన్నింటినీ ఆమె తిరస్కరించింది. ప్రధాన స్రవంతిలోని వారూ, ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు ఆమెని విమర్శించారు. ఆమె ని ఒప్పుకోలేదు. ఆమె శివ భక్తురాలు. ఆ రోజుల్లో ఇలాంటి పని చేయడానికి ఆమె ఎంత శక్తిని కూడా తీసుకొని ఉంటుందో కదా! ఆమె ఎక్కువ కాలం జీవించలేదు. ఎందుకంటే సరైన పోషణ, ఆహారం కూడా ఆమెకి దొరకలేదు.

కానీ ఆమె ఎటువంటి మనిషి అనుకోవాలి? ఆమె ఎంత ధైర్యవంతురాలు. మగ ప్రపంచంలో ఇలా ఉండగలగడం అంటే.. ఆరాధించదగ్గ మనుషులు వీళ్లంతా. ఎలా వాళ్ళు సాంఘిక కట్టుబాట్లను ఉల్లంఘించారు. ఆధ్యాత్మికంగా కూడా స్త్రీలకి అవకాశం లేదు. సన్యసించటం కూడా మగవాళ్ళకే ఉంది. పెళ్ళాం నచ్చలేదు అనుకోండి, మగవాడు సన్యసించి వెళ్ళిపోతాడు. అదే ఆడవాళ్ళకి? ఆడవాళ్ళకి మోక్షానికి కూడా హక్కు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ధైర్యం చేసి వా ళ్ళు స్వేచ్ఛను కనుగొన్నారు. నేను రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఈ విషయాలతో పాటు అనేక అం శాలను ఆలోచించాను. చివరికి నా, నేను ఎంచుకు న్న అంశం సరిపోతుంది అనిపించింది. కాళీ, దుర్గ ఉన్నారు. దేవతలను, ఆడవాళ్ళను పాట్రనైస్ చేశా రు. నువ్వు చాలా గొప్ప దానివి, అమ్మవి, అని వాళ్ల ని పొగుడుతూ, వాళ్లు మరింత ఎక్కువగా త్యాగా లు చేయడాన్ని, తమకున్నదంతా ఇవ్వడాన్ని ప్రో త్సహించారు. అది వాళ్ళ సొంత లాభాల కోసం జరిగిన పని.

మీ పరిశోధనలో భాగంగా మీరు ఏ ఏ ప్రాంతాలు తిరిగారు. మీకు కలిగిన అనుభవాలు ఏమిటి?

బ్రిటిషు వాళ్ళు గెజిటీస్ (గెజిట్లు), వాటి ఉద్దేశాలు ఏమైనా కావచ్చు కానీ ఆ డాక్యుమెంటేషన్‌లో ఇక్క డి జనం పల్స్ ఏమిటో రికార్డు చేసే ప్రయత్నం చే శారు. ఎందుకంటే భారతదేశం సంక్లిష్టమైనది. ‘ఫే స్ అండ్ ఫెస్టివల్’ పేరుతో కొన్ని ప్రత్యేకమైన గెజి ట్స్ తీసుకొచ్చారు. అవి నాకు చాలా ఉపయోగపడ్డాయి. గ్రామాల్లో ప్రజలు ఎవరిని పూజించేవారు వంటి సమాచారం కూడా ఉండింది. వాళ్లు ప్రతి గ్రామం నుంచి కూడా ఇలాంటి వివరాలు సేకరించారు. ఆ కథలు నా పరిశోధనలో ఒక గైడ్‌గా ఉపయోగపడ్డాయి. మొదట చాలా సమయం నేను ఆర్కైవ్స్‌లో నోట్స్ తీసుకుంటూ గడిపాను. అట్లా స్త్రీలు దేవతలుగా గ్రామ దేవతలుగా మారారని తెలిసింది.

- సశేషం... తరువాయి భాగం వచ్చేవారం




Tags

Next Story