మంచు పూలు

మంచు పూలు
X

గడ్డ కట్టే మంచు కురిసింది

కురిసి తెల్లని పూవై విరిసింది

చల్లని గాలికి పరిమళాలు

మంచు దుప్పటి కప్పుకున్నాయి

కొమ్మ లేని ధవళ వర్ణ పువ్వులు

ఏ కొమ్మ కోసి తెచ్చేనో

మంచు పువ్వుల

మంచు లింగ పూజకని

శిశిరములో వికశించినా

శ్రావణ హిమ లింగార్చనకని

పరిమళాలు దుప్పటిలో దాచినా

ఆ అమరనాథుని ఆరాధన కేనని

మంచుకైనా, మనిషికైనా

గుండెలో కోరికలు రగిలేనేని

మంచు రూపు దాల్చు హిమలింగమై

మనిషి మనసు

మంచు పూవై ఉరకలేయు

మంచులింగం, మంచుపూలు దర్శించ!

- పట్లొళ్ళ బక్కారెడ్డి

Tags

Next Story