స్వదేశీ 4జి నెట్‌వర్క్ వచ్చేసింది

స్వదేశీ 4జి నెట్‌వర్క్ వచ్చేసింది
X
టెలికమ్యునికేషన్ రంగంలో భారతదేశం మరో ఘనత సాధించింది. ఈ రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రోత్సహకంగా ప్రధా ని నరేంద్ర మోదీ శనివారం బిఎస్ ఎన్ ఎల్ కు చెందిన 4జి

న్యూఢిల్లీ: టెలికమ్యునికేషన్ రంగంలో భారతదేశం మరో ఘనత సాధించింది. ఈ రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రోత్సహకంగా ప్రధా ని నరేంద్ర మోదీ శనివారం బిఎస్ ఎన్ ఎల్ కు చెందిన 4జి నెట్‌వర్క్‌ను ప్రారంభించారు. నా ణ్యమైన టెలికాం పరికరాలను స్వయంగా త యారు చేసే ప్రతిష్టాత్మక లీగ్ లో భారతదేశం ప్రవేశించింది.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ రజతోత్సవం సందర్భంగా, ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా 97,500 కు పైగా మొబైల్ 4 జి టవర్లను ప్రారంభించారు. వాటిలో టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కి చెందిన 92,600 4జి టెక్నాలజీ సై ట్లు కూడా ఉన్నాయి. ఈ టవర్లను దాదాపు రూ. 37,000 కోట్ల ఖర్చుతో పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. స్వదేశీ 4 జి నెట్ వర్క్ ప్రారంభంతో ,సొంతంగా టెలికాం పరికరాలను తయారుచేసే డెన్మార్క్, స్వీడన్ , దక్షిణకొరియా,చైనా,వంటి దేశాల సరసన భారతదేశం చేరింది. భారతదేశంలో తయారు చేసిన నెట్ వర్క్ క్లౌడ్ ఆధారితమైనది. భవిష్యత్ లో 4 జి నెట్‌వర్క్‌ను సులభంగా 5జి నెట్ వర్క్ కు అప్ గ్రేడ్ చేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఈ ప్రారంబంతో ఒడిశా లోని 2,472 గ్రామాలతో పాటు, దేశం వివిధ ప్రాంతాల్లో 26,700 పైగా గ్రామాలకు 4 జి నెట్ వర్క్ అందుబాటులోకి వస్తుంది. కొత్తగా మరో 20 లక్షల చందా దారులకు సేవలు అందిస్తుందని బిఎస్ ఎన్ ఎల్ పేర్కొంది. ఈ టవర్లు అన్నీ సౌరశక్తితో పనిచేస్తాయి.

Tags

Next Story