లడఖ్ లో అల్లర్లను రెచ్చగొట్టిన సోనమ్ వాంగ్ చుక్ కు పాక్ తో సంబంధాలు

లడఖ్ లో అల్లర్లను రెచ్చగొట్టిన సోనమ్ వాంగ్ చుక్ కు పాక్ తో సంబంధాలు
X
కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుతూ నిరాహారదీక్ష చేసిన సోనమ్ వాంగ్ చుక్ కు పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని డిజీపీ ఎస్ డి సింగ్ జమ్వాల్

కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుతూ నిరాహారదీక్ష చేసిన సోనమ్ వాంగ్ చుక్ కు పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయని డిజీపీ ఎస్ డి సింగ్ జమ్వాల్ శనివారం నాడు పేర్కొన్నారు. పొరుగు దేశాలలో అతడి పర్యటనల విషయంలోనూ ఆందోళన ఉన్నట్లు తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ చట్టం (నాసా) కింద శుక్రవారం వాంగ్ చుక్ ను అరెస్ట్ చేసి రాజస్థాన్ లోని జోధ్ పూర్ సెంట్రల్ జైలుకు తరలించారని అధికార వర్గాలు తెలిపాయి. వాంగ్ చుక్ తో సంబంధం కలిగాడని భావిస్తన్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు డిజిపీ తెలిపారు.ఈ మధ్య తరచు లడఖ్ కు వస్తున్న పాక్ కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారి మళ్లీ వచ్చినట్లు తెలిసి అరెస్ట్ చేశారు. అతడి కదలికల రికార్డును పోలీసుల వద్ద ఉంది.


సోనమ్ వాంగ్ చుక్ పాకిస్తాన్ లో జరిగిన డాన్ కార్యక్రమానికి హాజరయ్యాడు. బంగ్లాదేశ్ నూ సందర్శించాడు. దీంతో అతడి కార్యకలాపాలపై నిఘా పెట్టి దర్యాప్తు చేస్తున్నట్లు డిజీపీ తెలిపారు.పెప్టెంబర్ 24న లేహ్ లో జరిగిన హింసాత్మక సంఘటన సందర్భంగా వాంగ్ చుక్ హింసాకాండను రెచ్చగొట్టడని డీజీపి ఆరోపించారు. నిరసనకారులు హింసకు, దహనకాండకు పాల్పడడంతో నలుగురు చనిపోయారు. 80 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక బీజేపీ ఆఫీసుతోపాటు, కొన్ని వాహనాలు దగ్ధమయ్యాయి. వాంగ్ చుక్ రెచ్చగొట్టే ప్రకటనలు అశాంతికి కారణమని ప్రభుత్వం పేర్కొంది. అంతే కాదు. లఢఖ్ లో అధికారులు,ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చల పట్ల అసంతృప్తి చెందిన శక్తులు కూడా నిరసన కారులను రెచ్చగొట్టాయని ఆరోపించారు.


అరబ్ స్పింగ్, - అరబ్ ప్రపంచంలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు, నేపాల్ జనరల్ జెడ్ నిరసనలను వివరిస్తూ, వాంగ్ చుక్ చేసిన ప్రసంగాలతో అల్లర్లు జరిగాయని పోలీసులు తెలిపారు. నిరసనకారులు లేహ్ లో బీజేపీ ఆఫీసు, పలు వాహనాలను తగులపెట్టారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆరోపించింది. సోనమ్ వాంగ్ చుక్ స్థాపించిన సంస్థ పై విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం ఉల్లంఘించి ఆరోపణలపై సిబీఐ విచారణ ప్రారంభించింది.

Tags

Next Story