తమిళ నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట

తమిళ నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
X
తమిళనాడులో శనివారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టివికె) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఇప్పటివరకు

చెన్నై: తమిళనాడులో శనివారం ఘోర సంఘటన చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టివికె) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్‌లో నిర్వహించిన సభలో తీవ్ర తొక్కిసలాట జరిగి ఇప్పటివరకు 36 మంది ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో పార్టీ కార్యకర్తలతోపాటు ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కరూర్ ర్యాలీకి విజయ్ అనుకున్న సమయానికి ఆరు గంటలు ఆలస్యంగా రావడంతో అభిమానులు ఆయనను చూడడానికి, దగ్గరికి వచ్చి ప్రసంగం వినడానికి పోటీపడ్డారు. ఆయన వేదిక దగ్గర దాదాపు 30 వేల మంది అభిమానులు ఆయన ప్రసంగం వినడానికి మూకుమ్మడిగా ఉండడం కనిపించింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారింది. దీంతో తొక్కిసలాట పరిస్థితి ఏ ర్పడింది. అనేక మంది స్పృహతప్పి పడిపోయారు. పరిస్థితి గమనించిన విజయ్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. స్పృహతప్పిన వారి వద్దకు చేరుకునేలా వాటర్ బాటిళ్లను తన వాహనంపై నుంచే జనంలోకి విసిరారు. ఎమర్జెన్సీ అంబులెన్సులకు దారి ఇవ్వాల్సిందిగా తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. భారీ సమూహంలో అతికష్టం మీద అక్కడికి చేరుకున్న అంబులెన్సుల్లో బాధితులను ఆస్పత్రులకు తరలించారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్బ్రాంతి

ఈ విషాద సంఘటన సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి చెందారు. “ కరూర్ నుంచి వస్తోన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు అన్ని విధాలా సాయం అందించాలని ఆ రోగ్యశాఖ మంత్రి, కలెక్టర్‌కు సూచించా. కరూర్ లో సాధారణ పరిస్థితులు తీసుకు వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించా. డాక్టర్లకు, పోలీసులకు సహకరించాలని కరూర్ పౌరులకు విజ్ఞప్తి చేస్తు న్నా” అని సిఎం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ప్రధాని మోడీ దిగ్భ్రాంతి

న్యూఢిల్లీ: తమిళనాడు లోని కరూర్‌లో టివికె అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 36 మంది మృతి చెందడంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాట సం ఘటన తీవ్ర దురదృష్టకరమని పేర్కొన్నారు. మృ తుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గా యపడిన వారు త్వరగా కోలుకోవాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

Tags

Next Story