ఉత్తర ప్రదేశ్ లో రెచ్చిపోయిన మూకలు

ఉత్తర ప్రదేశ్ లో శుక్రవారం బరేలీలో ఐ లవ్ ముహమ్మద్ ప్రచారంతో మొదలైన నిరసనలు హింసాత్మకంగా మారడంతో బరేలీతో పాటు, బారాబంకీ, మౌ జిల్లాలకు అల్లర్లు విస్తరించాయి. బరేలీలో శుక్రవారం ప్రార్థనల తర్వాత ఓ మసీదు వెలుపల, నగరంలోని అనేక ప్రాంతాలలో అల్లర్లు చెలరేగాయి.బరేలీలో మతాధికారి, ఇత్తెహాద్ -ఎ-మిల్లత్ కౌన్సిల్ (ఐఎంపి) చీఫ్ మౌలానీ తౌకీర్ రజా ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 40 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన పార్టీ కార్యవర్గం సభ్యులతో పాటు చాలా మందిపై 11 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశారు. దాదాపు 2000 మందిని నిందితులుగా చేర్చారు.ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారు ఎంతటివారైనా క్షమించబోమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. యూపీలో ఎవరు అధికారంలో ఉన్నారోబరేలీ లోని మౌలానా మరచిపోయినట్లు ఉన్నారు. తన ఇష్టానుసారం ప్రభుత్వ యంత్రాంగాన్ని నిరోధించ గలమని భావిస్తున్నట్లు ఉన్నారు. ఇక దిగ్బధాలు, కర్ఫ్యూలు ఉండవు. యూపీ సర్కార్ నేర్పే పాఠం భవిష్యత్ తరాలు అల్లర్లకు తెగపడాలంటే రెండు సార్లు ఆలోచించేలా చేస్తుందని ముఖ్యమంత్రి తీవ్ర పదజాలంతో హెచ్చరించారు.
పశ్చిమ యూపీలో అశాంతి సృష్టించేందుకు, నోయిడా ఇంటర్నేషనల్ ట్రేడ్ షోతో సహా రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్రలో భాగమే ఈ అల్లర్లు అని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.బరేలి లో శుక్రవారం ప్రార్థనల తర్వాత తౌకీర్ రజా ఇంటి ముందు, కొత్వాలీ మసీదు వద్ద ఐ లవ్ ముహమ్మద్ పోస్టర్లను పట్టుకున్న చాలామంది జనం గుమికూడారు. పోలీసులు వారిని చెదరగొట్టందుకు ప్రయత్నించినప్పుడు నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు స్వల్పగా లాఠీలకు పని చెప్పారు. బరేలీలోనే దర్గా -ఎ-అలా హజ్రత్, ఇస్లామియా గ్రౌండ్ సమీపంలో గుమికూడిన నిరసనకారులు, ఇస్లామియా ఇంటర్ కాలేజీగ్రౌండ్ వైపునకు దూసుకువెళ్తూ, రాళ్ళు రువ్వుతూ హింసాకాండకు తెగపడ్డారు.రాళ్లదాడి, విధ్వంసం వల్ల పలువాహనాలు, దుకాణాలు దెబ్బతిన్నాయి. భయాందోళనలు వ్యాపించడంతో అలమ్ గిర్ గంజ్, సివిల్ లైన్స్, బడా బజార్, బాన్స్ మండిలలోని దుకాణాలు మూసివేశారు.
బరేలీలో జరిగిన ఘర్షణల తర్వాత శుక్రవారం రాత్రి రాష్ట్ర రాజధాని లక్నోకు సమీపంలోని బారాబంకి జిల్లా ఫైజుల్లా గంజ్ గ్రామంలో ఐ లవ్ ముహమ్మద్ అని రాసి ఉన్న బ్యానర్ ను చింపివేడంతో ఉద్రిక్తత చెలరేగింది. దీంతో ఓ కమ్యునిటీకి చెందిన జనం మసీదువద్ద గుమికూడారు ఆ బ్యానర్ ను చించివేశాడని భావిస్తున్న ధన్నీ అనే వ్యక్తి ఇంటిపై కొందరు యువకులు దాడిచేసి, ఇంట్లో సామాను ధ్వంసం చేశారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసు అదనపు సూపరింటెండెంట్, ఇతర అధికారులు అదనపు బలగాలను తరలించి, అల్లర్లు నివారించే యత్నం చేశారు.2010 లో బరేలీలో అల్లర్లు చెలరేగిన సమయంలో తౌకీర్ రజా జైలు పాలయ్యాడు. నగరంలో 23 రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. ఈ సారి మొదట రజాను గృహనిర్బంధంలో ఉంచి, తర్వాత అతనిని ఫైజ్ ఎన్ క్లేవ్ నుంచి అర్థరాత్రి అరెస్ట్ చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. హింసాకాండ పై విచారణ చేపట్టడంతో పాటు, దౌర్జన్యకాండతో సంబంధం ఉన్న రజా అనుచరుల మొబైల్ ఫోన్ లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
బరేలీలో పక్కా ప్రణాళికతో జరిగిన కుట్ర ఫలితమే అల్లర్లు - డిఐజీ
అనుమతి లేకుండా ప్రదర్శనలపై బరేలీలో నిషేధం ఉందని, అయినా శుక్రవారంనాడు కొంతమంది శుక్రవారం ప్రార్థనల తర్వాత శాంతిని దెబ్బతీసేందుకు యత్నించారని, పోలీసులు కఠినంగా వ్యవహరించారని జిల్లా మెజిస్ట్రేట్ అవినాశ్ సింగ్ అన్నారు. కాగా,బరేలీలో ఉద్దేశ పూర్వకంగా ప్రక్కా ప్రణాళికతో అల్లర్లకు కుట్రపన్నారని, డిఐజి అజయ్ కుమార్ సాహ్ని అన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఆయనప్రకటించారు.
హింసకు పాల్పడితే కఠినంగా అణచివేస్తాం- యుపీ సీఎం ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలకు అంతరాయం కలిగిస్తే సహించబోమని, అల్లర్లను కఠినంగా అణచి వేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం హెచ్చరించారు.ఐ లవ్ ముహమ్మద్ పేరుతో మొదలైన నిరసనలు బరేలీలో హింసాకాండకు దారితీయడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.యూపీ పోలీసులు వాటిని అణచివేసేందుకు చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు. పండుగలు జరిగినప్పుడల్లా గతంలో కొంత అల్లర్లు జరిగేవి, కానీ, ఆ రోజులు పోయాయి. అల్లర్లకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం తప్పదు. అలాంటి చర్యలకు పాల్పడవద్దు. పాల్పడిన పక్షంలో భవిష్యత్ తరాలు కూడా గుర్తుంచుకునేలా కఠినంగా వ్యవహరిస్తాం అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. యుపీలో అధికారంలో ఉన్న వారెవరూ ఆ మౌలా మరచిపోయినట్లుఉన్నారని, ఆదిత్యనాథ్ ఎటువంటి పేర్లు ప్రస్తావించకుండానే హెచ్చరించారు.
ఒక మీడియా సంస్థ నిర్వహించిన వికసిత్ యూపీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. మతాధికారి రజా ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని ఆయన ఈవ్యాఖ్య చేసినట్లు కనిపిస్తోంది.అల్లర్లను రెచ్చగొట్టిన అతడు తాను కోరుకున్నప్పుడల్లా అల్లర్లను రెచ్చగొట్టడం ద్వారా ప్రభుత్వాన్ని స్థంభింపజేయగలమని అనుకున్నట్లు ఉందని, ఇక ముందు రోడ్ బ్లాక్ లు, కర్ఫ్యూలు ఉండబోవని, మీ భవిష్యత్ తరాలు ఎన్నటికీ మరచి పోకుండా మీకు తగిన గుణపాఠం చెబుతామని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆ వేదిక నుంచి హెచ్చరించారు.
-
Home
-
Menu