వరల్డ్ చాంపియన్ శీతల్ దేవి

వరల్డ్ చాంపియన్  శీతల్ దేవి
X
సాధారణంగా విలు విద్య అంటేనే చేతులతో ప్రదర్శించేది. అలాంటి్ంది చేతులు లేకుండా భారత పారా ఆర్చర్ శీతల్ దేవి వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపి

సాధారణంగా విలు విద్య అంటేనే చేతులతో ప్రదర్శించేది. అలాంటి్ంది చేతులు లేకుండా భారత పారా ఆర్చర్ శీతల్ దేవి వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ప్రపంచ పారా ఆర్చరీ చాంపియన్ షిప్ లో భాగంగా మహిళల వ్యక్తిగత కాంపాండ్ కేటగిరిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ నంబర్ వన్, టర్కీకి చెందిన ఓజ్నుర్ క్యూర్ గిర్డీని 146-143 తేడాతో ఓడించి స్వర్ణం గెలుచుకుంది.దక్షిణ కొరియాలోని గ్వాన్ జూ వేదికగా శనివారం జరిగిన పోటిలో శీతల్ దేవి పసిడి గెలించింది.

చేతుల్లేకుండానే చాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన ఆర్చర్ గా శీతల్ చరిత్రకెక్కింది. అంతేకాదు పద్దెమినిదేళ్ల వయసులో శీతల్ దేవి ఈ ఘనత సాధించింది. అంతకు ముందు.. తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో శీతల్ దేవీ కాంస్యం గెలుచుకుంది. మరోవైపు మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్లో సరితతో కలిసి ఆమె రజత పతాకంతో సరిపెట్టుకుంది.

Next Story