తెలంగాణ మోడల్ సృష్టిద్దాం

తెలంగాణ మోడల్ సృష్టిద్దాం
X
గ్రూప్-1 ఉద్యోగాలను తాను 2కోట్లు, 3కోట్లకు అమ్ముకున్నట్లు కొందరు దుష్ప్రచారం చే శారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్-1 ఉద్యోగాలను తాను 2కోట్లు, 3కోట్లకు అమ్ముకున్నట్లు కొందరు దుష్ప్రచారం చే శారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో కనీసం తాను ఛాయ్ అయి నా తాగానా? అని అడిగారు. కుట్రపూరితంగా తప్పుడు ప్రచారం చేసినా, కేసు లు వేసినా తట్టుకున్నామన్నారు. కడుపు నిం డా విషం పెట్టుకొని నిరుద్యోగులను దెబ్బతీయాలని చూశారని చెప్పారు. అ యినా నిరుద్యోగుల భవిష్యత్ కోసం తాము కొట్లాడామని చెపారు. అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు తనకు అభ్యర్థుల భవిష్యత్ మాత్రమే కనిపించిందని తెలిపారు.గ్రూప్-1 విజేతలకు శనివారం శిల్పాకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ, 3 లక్షల మందితో పోటీ పడి... 562 మందిలో ఒకరిగా మీరంతా నిలిచారని విజేతలను కొనియాడారు. మీరే తెలంగాణ భవిష్యత్ అని విజేతలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.

తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత ఎంపికైన అభ్యర్థుల చేతుల్లో ఉదని వ్యాఖ్యానించారు. అధికారులుగా మారిన అభ్యర్థులు నవ్విన వాడి ముందు జారిపడ్డట్టు చేయొద్దని, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్ధామని పిలుపునిచ్చారు. గ్రూప్ 1కు ఎంపికైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలని, తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు సహకారం అందించాలని కోరారు.ఇక నుంచి మీరు తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్ అంటూ ఎంపికైన అభ్యర్థులను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర, గుజరాత్ మోడల్ కాదు.. తెలంగాణ మోడల్ సృష్టించాలని పిలుపునిచ్చారు.


కొందరు కారణజన్ములమని భావించారు

తెలంగాణకు వీరోచిత చరిత్ర ఉందని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కో సం తెలంగాణలో ఎన్నో పోరాటాలు జరిగాయని అన్నారు. తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయని, ఏ మారుమూల పల్లెకు, గూడెంకు వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. కానీ, కొందరు కారణజన్ములమని, వారి కుటుంబమే తెలంగాణ అని భావించారని విమర్శించారు. తెలంగాణ ప్రజలు నమ్మి వారికి బాధ్యతలు అప్పగిస్తే నమ్మక ద్రోహం చేశారని, నమ్మకద్రోహులుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. కాలం కలిసొచ్చి రెండుసార్లు గెలిస్తే కారణజన్ములు అనుకున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు గ్రూప్- 1 నిర్వహించలేదు, వాళ్లు ఉద్యమకారులా..? అని ప్ర శ్నించారు. తెలంగాణ స్ఫూర్తి వారిలో లేదని పేర్కొన్నా రు. పదేళ్లుగా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదంటే ఎం త బాధ్యతారాహిత్యమో ఆలోచించాలని కోరారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారని అన్నారు. గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా నియమించారని, ఆర్‌ఎంపి డాక్టర్లు, టీచర్లు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఫలితంగా ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్‌లో కనిపించాయని చెప్పారు.

అందుకే తాము అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, ఉన్నతాధికారులను, ప్రొఫెసర్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించామని తెలిపారు. అందుకే సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించామని, ఇది కొంతమందికి నచ్చలేదని అన్నారు. గ్రూప్ 1 నియామకాలు ఆలస్యం కావడంలో కోచింగ్ సెంటర్ల కుట్ర ఉందని ఆరోపించారు. ఏళ్ల తరబడి నిరుద్యోగులు తీసుకునే కోచింగ్‌లు సెంటర్లకు ఆదాయ వనరుగా మారిందని మండిపడ్డారు. గత గ్రూప్-1 నోటిఫికేషన్ పూర్తికావడానికి ఏడేళ్లు పట్టిందని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలల్లో గ్రూప్-1 నియామకాలు పూర్తి చేయడం ఒక రికార్డు అని వ్యాఖ్యానించారు.

తల్లిదండ్రులను

గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి

గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మీ భవిష్యత్తు కోసం శ్రమించిన తల్లిదండ్రుల బాధ్యత మీదే అని విజేతలను ఉద్దేశిస్తూ వ్యా ఖ్యానించారు. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉద్యోగుల జీతాల్లోంచి 10 శాతం కట్ చేసి వారి ఖాతా ల్లో వేసామని చెప్పారు. త్వరలోనే ఈ చట్టం తీసుకురానున్నట్లు సిఎం వెల్లడించారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు

వస్తూనే ఉంటాయి: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టిజిపిఎస్‌సిని ప్రక్షాళన చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కూలీలు, పారిశుద్ధ్య కార్మికుల పిల్లలు అనేకమంది గ్రూప్ 1 సాధించారని అన్నారు. గ్రూప్-1 విజేతలు కొత్త జీవితం ప్రారంభించబోతున్నారని, రాష్ట్ర ప్రగతిలో కీలకపాత్ర పోషించబోతున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పదేళ్లుగా గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వలేదని.. కానీ, తాము ప్రభుత్వం ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు ఇ చ్చామని తెలిపారు ఆది ఆరంభం మాత్రమే అని, ఉద్యోగ నోటిఫికేషన్లు నిరంతరం వస్తూనే ఉంటాయని తెలిపారు. కొందరికి చెంపదెబ్బ కొట్టినట్లుగా ఈ కార్యక్రమం ఉం దన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలతోనో మీరు విజేతలు కాలేదు, మీ విజయాలను కూడా అపహాస్యం చేసే ప్రయత్నం గత పాలకులు చేశారని విజేతలను ఉద్దేశిస్తూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

Tags

Next Story