ప్రత్యక్ష రాజకీయాలకు సిపిఐ నారాయణ దూరం

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ ప్రత్యక్ష రాజకీయల నుంచి తప్పుకున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. చండీగఢ్ లో జరిగిన సిపిఐ 25వ మహాసభల్లో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. నారాయణతో పాటు సిపిఐ కార్యదర్శి పదవికి తెలంగాణకు చెందిన సయ్యద్ అజీజ్ పాషా కూడా తప్పుకున్నారు. 75 ఏళ్లు నిండిన వారిని పార్టీ కీలక పదవుల నుండి తప్పించాలని తీసుకున్న నిర్ణయం మేరకు నారాయణ, అజీజ్ పాషాలు తప్పుకున్నారు. అయితే ఈ నిర్ణయం నుండి పార్టీ జాతీయ కార్యదర్శి రాజాకు మినహాయింపు నిచ్చారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై గతంలో విజయవాడలో జరిగిన పార్టీ మహా సభల్లోనే ప్రధానంగా చర్చ జరిగింది అయితే అది అమలు కాలేదు. పంజాబ్ లో జరిగిన మహా సభల్లో కచ్చితంగా అమలు చేయాలని నీర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే 75 ఏళ్లు నిండిన వాళ్లందరినీ కీలక పదవుల నుంచి తప్పించారు.
సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా నారాయణ
పార్టీ కీలక పదవుల నుండి తప్పుకున్న నారాయణకు పార్టీ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. పార్టీలో అంతర్గతంగా తలెత్తే సమస్యలను, వాటిని పరిష్కరించే పని కంట్రోల్ కమిషన్ చూస్తుంది. కంట్రోల్ కమిషన్ కు చైర్మన్, సెక్రెటరీ ఉంటారు. మొత్తం 9 మంది సభ్యులు ఈ కమిషన్ లో ఉంటారు. చైర్మన్ నియమితులైన నారాయణ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా పోరాటాలతోనే కాకుండా తన మాటల తూటాలతోను ప్రజల్లో, పత్రికల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వాలపై తన మాటల తూటాలను పేల్చే నారాయణ జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా పని చేస్తూ దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ప్రతిరోజు కీలక అంశాలపై స్పందిస్తూనే ఉంటారు.
-
Home
-
Menu