వచ్చే నెలాఖరులోగా డిసిసిలు

మన తెలంగాణ/హైదరాబాద్ :వచ్చే నెలాఖరులోగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ క మిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కసరత్తు ముమ్మరం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశమై రాష్ట్ర రాజకీయాలు, ప్రభు త్వం చేపడుతున్న, చేపట్టిన వివిధ సంక్షేమ, అ భివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పా ర్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న వారికే డిసిసిల్లో స్థానం కల్పించాలని ఈ సందర్భంగా ఖర్గే పిసిసి అధ్యక్షునికి సూచించినట్లు సమాచారం. వచ్చే నెల నాలుగవ తేదీ నుంచి ఏఐసిసి పరిశీలకులు అన్ని జిల్లాల్లో పర్యటించేలా చర్యలు తీసుకున్నట్లు ఖర్గే ఆయనకు వివరించారు,. ప క్షం రోజుల పాటు వారు జిల్లాల్లో పర్యటించి ప్రతి జిల్లాకు ఆరుగురి పేర్లతో ప్రతిపాదనలు స మర్పిస్తారని ఖర్గే ఆయనకు చెప్పారు. అందులో నుంచి సమర్థుడైన నేతను జిల్లా పార్టీ అధ్యక్షుని గా నియమించవచ్చన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలను ధీటు గా ఎదుర్కొ గల నేతను అధ్యక్షునిగా నియమించాలని ఆయన సూచించిన ట్లు సమాచారం. సంస్థాగత పునర్ నిర్మాణం పగడ్బందిగా చేయాలని ఖర్గే ఆయనకు సూచించారు. ఇదిలాఉండగా రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా సం క్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి మహేష్ కుమార్ గౌడ్ వివరించారు.
-
Home
-
Menu
