లగ్జరీ కార్ డీలర్ బసరత్ ఖాన్ ఇల్లు కార్యాలయంలో ఇడి సోదాలు..

ఫెమా ఉల్లంఘన కేసులో బసరత్ ఖాన్ పై ఇప్పటికే ఇడి కేసు నమోదు..
బసరత్ ఖాన్ ఇప్పటికే అరెస్టు చేసిన అహ్మదాబాద్ ఇడి అధికారులు.
హైదరాబాదులో లగ్జరీ ఇంపార్టెంట్ కార్ల విక్రయాల డీలర్‌గా ఉన్న బసరత్ ఖాన్
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలోని లగ్జరీ కార్ల డీలర్ బసరత్ అహ్మద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాలపై శుక్రవారం ఇడి సోదాలు నిర్వహిం చింది. జూబ్లీహిల్స్‌లోని ఖాన్ నివాసం, గచ్చిబౌలిలోని ఎస్‌కె కార్ లౌంజ్‌తో పాటు ఆయన స్నేహితుల ఇళ్లలోనూ దాదాపు 6 గంటల పాటు ఈ దాడులు జరిగాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనల కేసులో భాగంగా, స్మగ్లింగ్ ద్వారా దిగుమతి చేసిన హైఎండ్ కార్ల వ్యవహారాలపై అధికా రులు ఈ సోదాలు చేపట్టారు. బసరత్ ఖాన్ ఇప్పటికే అహ్మదాబాద్ ఇడి అధికారుల చేత అరెస్టు కాగా, గతంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలి జెన్స్ (డిఆర్‌ఐ) కూడా ఆయనపై కేసు నమోదు చేసింది. అమెరికా, జపాన్ నుండి దిగుమతి చేసిన లగ్జరీ కార్లను దుబా య్, శ్రీలంక మార్గం ద్వారా తెచ్చి, ఎడమ స్టీరింగ్ వాహనాలను కుడి వైపు స్టీరింగ్‌గా మార్చి, తక్కువ ధరకు డిక్లేర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ తప్పుడు డాక్యుమెంట్ల కారణంగా ప్రభుత్వానికి దాదాపు 25 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. విచారణలో ఖాన్ అనేక వాహనాలను అండర్వాల్యూ చేసినట్లు అంగీకరించాడు. టయోటా ల్యాండ్ క్రూజర్, రోల్స్ రాయిస్ కలినన్, లెక్సస్ ఎల్‌ఎక్స్-500డి వంటి కార్ల ను తక్కువ ధరకు చూపించానని, ఎనిమిది వాహనాలపై తక్కువగా చెల్లించిన డ్యూటీ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు సమయం కావాలని అధికా రులకు తెలిపాడు. ఈ వ్యవహారం రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. దర్యాప్తులో మాజీ బిఆర్‌ఎస్ మంత్రితో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఒక సిట్టింగ్ మంత్రి కూడా ఖాన్ వద్ద నుండి లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం బయటపడిం ది. దీంతో బిజెపి, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీల మధ్య వాదోపవాదాలు ముదురుతున్నాయి. బసరత్ ఖాన్ నుంచి లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన వారిలో స్టార్ యాక్టర్లు కూడా ఉన్నారని చెబుతున్నారు.
ఇడి దర్యాప్తునూ స్వాగతిస్తున్నాం : బండి సంజయ్
అక్రమ కార్ల దిగుమతులపై ఇడి దర్యాప్తును స్వాగతిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. దేశ ఖజానాకు నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విక్రేతలతో పాటు కొనుగోలుదారులపైనా విచారణ జరపాలన్నారు.
-
Home
-
Menu