ఫ్యూచర్ సిటీకి నేడు పునాదిరాయి

మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ సమీపం లో భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని ని ర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే నేడు (ఈ నెల 28 తేదీన) ఉద యం 11 గంటలకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భ వన నిర్మాణానికి పునాది రాయి వేయనున్నారు. ఫ్యూ చర్‌సిటీలోని మీర్‌ఖాన్‌పేటలో 7.29 ఎకరాల స్థలా న్ని ఎఫ్‌సిడిఏకు కేటాయించారు. అందులో 2.11 ఎ కరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఎఫ్‌సిడిఏ భవనానికి సిఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఉదయం భూమి పూజ చేయనున్నారు. రావిర్యాల నుంచి ఆమనగల్ వరకు నిర్మించనున్న గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు 1 నిర్మాణానికి సైతం సిఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేయనున్నారు. ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్-జీ రో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. దీని మొత్తం వైశాల్యం 30,000 ఎకరాలు కాగా, నివాస, వాణి జ్య, పారిశ్రామిక, వినోద, గ్రీన్ జోన్లుగా భారత్ ఫ్యూ చర్‌సిటీ నిర్మాణం జరుగనుంది. 3అసెంబ్లీ ని యోజకవర్గాల పరిధిలోని 7 మండలాలు, 56 రెవెన్యూ గ్రా మాల పరిధిలో సిటీని ప్రభుత్వం విస్తరించనుంది.
765 చ.కి.మీ. విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ
హైదరాబాద్‌కు దక్షిణ ప్రాంతంలో 765 చ.కి.మీ. విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీని (ఎఫ్‌సిడిఏ)ని సైతం ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్భన్ ఏరియా (డెవలప్‌మెంట్) యాక్ట్-1975 కింద ఎఫ్‌సిడిఏ పనిచేయనుంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్‌ను భావితరాలకు స్థిరమైన, సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’లో ప ర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. ని వాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేం త దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందిం చారు. ఆ ధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్‌ను అధికారులు రూపొందించారు. ప్రపంచబ్యాంకు, జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జైకా) వంటి అంతర్జాతీయ సంస్థలు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి.
ఔటర్, సాగర్ హైవేలకు సరిహద్దుగా..
ఔటర్ రింగ్ రోడ్డు, శ్రీశైలం హైవే, నాగార్జునసాగర్ హైవేలతో సరిహద్దుగా భారత్ ఫ్యూచర్ సిటీ నిలవనుంది. ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. హైదరాబాద్‌పై ఒత్తిడిని తగ్గించడం, స్మార్ట్ మౌలిక సదుపా యాలు, స్థిరమైన జీవనం, వేగవంతమైన ఆర్థిక వృద్ధితో ప్రణాళికాబద్ధంగా ప్రత్యామ్నాయాన్ని అందించడమే భారత్ ప్యూ చర్ సిటీ లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (టిజిఐఐసీ) అభివృద్ధి చేస్తోంది. ప్రఖ్యాత అంతర్జాతీయ సంప్రదింపు సంస్థ సాయంతో మాస్టర్ ప్లానింగ్‌కు రూపకల్పన శరవేగంగా జరుగుతోంది.
వర్షపు నీటి నిర్వహణకు స్పాంజ్ పార్కులు
ఆధునిక పర్యావరణ పద్ధతుల ద్వారా జీవావరణ సంరక్షణపై మాస్టర్‌ప్లాన్‌లో అధికారులు దృష్టి సారిస్తున్నారు. పారిశ్రామిక, నివాసిత ప్రాంతాల్లో వర్షపు నీటి నిర్వహణ కోసం స్పాంజ్ పార్కులు నెలకొల్పనున్నారు. ఇవి నీటిని గ్రహించి, వరదలను నివారిస్తాయి. రోజువారీ నీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పునర్వినియోగ నీటి పద్ధతిని అమలు చేయనున్నారు. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ దృష్టి పెడతారు.
నెట్-జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ
భారత్ ఫ్యూచర్ సిటీ సరిహద్దు వెంట అనేక హోటళ్లు, రిసార్ట్‌లను నిర్మించనున్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఈ-వేస్ట్ డిస్పోజల్ మెకానిజమ్స్, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లతో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగనుంది. ఇవి అన్ని రకాల వ్యర్థాల నిర్వహణను సమర్థంగా నిర్వహించనున్నాయి. ఈ సిటీని నెట్-జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా నిర్మించనున్నారు.
ట్రాఫిక్ లేకుండా రూపకల్పన
భారత్ ఫ్యూచర్‌సిటీకి ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రయాణించడానికి ప్రభుత్వం ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌లను కలుపుతూ రోడ్లను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ (రేడియల్ రోడ్ నం.1) ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాల ఇంటర్‌ఛేంజ్ (టాటా ఇంటర్‌ఛేంజ్) నుంచి రీజనల్ రింగ్‌రోడ్డు వద్ద ఆమనగల్లు వరకు భారత్ ఫ్యూచర్ సిటీ, ఎఫ్‌సిడిఏ కింద అభివృద్ధి చేస్తు న్న పారిశ్రామిక కారిడార్లను కలుపుతూ ప్రభుత్వం రహదారికి ప్రణాళికలను రూపొందించింది. ఇది ఎన్‌హెచ్19, ఎన్‌హెచ్765లపై ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గిస్తూ ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించనుంది.
Tags
-
Home
-
Menu