రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారు: హరీష్‌రావు

గ్లోబల్ సమ్మిట్‌ను ‘గోబెల్స్ సమ్మిట్‘ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు. గతంలో దావోస్ వెళ్లి డొల్ల కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని రేవంత్ నవ్వులపాలయ్యారని విమర్శించారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూమి, ఫార్మా సిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమి బిఆర్‌ఎస్ హయాంలో సమీకరించినదే గుర్తు చేశారు. అందులో రేవంత్ చెమట చుక్క కూడా లేదని అన్నారు. కెసిఆర్ యువత ఉద్యోగాల కోసం ఆలోచిస్తే, రేవంత్ ఆ భూములను తన అనుయాయులకు పంచిపెడుతున్నారని ఆరోపించారు. రెండో ఏడాది పాలన పెనంలోంచి పొయ్యిలో పడినట్లు ఉందని, మూడో ఏడాది ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిది ప్రైవేట్ లిమిటెడ్ పాలన అంటూ దుయ్యబట్టారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు వేదన, రోదన మిగిల్చారన్నారు.
రేవంత్ పాలనలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని విమర్శించారు. రెండేళ్ల పాలనలో ఆదాయం ఎందుకు తగ్గిందో చూసుకోవాలని పేర్కొన్నారు. ఆర్గనైజ్డ్ కరప్షన్ పాలన రేవంత్ కుటుంబం, మంత్రులది అని ఆరోపించారు. కరప్షన్ ఎలా చేయాలో కాంగ్రెస్ పాలన చూసి నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు. వ్యవస్థీకృత అవినీతికి కాంగ్రెస్ అధిష్టానం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన ప్రజలకు మొండి చేయి చూపించిందని... అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం విజన్, విధానం ఏంటో ఎవరికి ఇప్పటికీ అర్థం కావడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, అభివృద్ధి, సంక్షేమం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు జరుపుకోవాలని హరీష్‌రావు అన్నారు.
-
Home
-
Menu
