అరబిందోను కాల్చేస్తా

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: రైతుల వ్యవసాయ పంటకు నష్టం కలిగించే పరిశ్రమను కాల్చి పారేస్తానంటూ జడ్చర్ల ఎంఎల్‌ఎ అనిరుధ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు శు క్రవారం వీడియో విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చ ర్ల పోలేపల్లి సెజ్‌లో ఉన్న అరబిందో పరిశ్రమ నుండి గత కొంతకాలంగా రైతుల పొలాల్లోకి వ్యర్థపు రసాయన నీళ్లు వస్తున్నాయి. దీంతో ప్ర జలతో పాటు అక్కడి పంట పొలాలు, పశువు లు కూడా అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఎంఎల్‌ఎకి ఫిర్యాదు చే శారు. దీంతో ఆయన అరబిందో ఫ్యాక్టరీపై కా లుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వచ్చే ఆదివారం ఉదయం 11 గంటల లోగా కాలు ష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకోకపోతే ఆ పరిశ్రమను కాల్చి పారేస్తానంటూ హెచ్చరించారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.
-
Home
-
Menu
