ఏ క్షణమైనా షెడ్యూల్?

ఏ క్షణమైనా షెడ్యూల్?
X
స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో సైరన్ మోగనున్నది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) సర్వం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల్లో బి సిలకు 42శాతం

మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలో సైరన్ మోగనున్నది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) సర్వం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల్లో బి సిలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎన్నిక ల ప్రక్రియకు ఎస్‌ఇసి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా అ న్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఎన్నికల నిర్వహ ణ అధికారులకు శిక్షణ కూడా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్ల జిఒ విడుదలకు నిర్ణయం తీసుకున్నప్పటికీ,బిసి రిజర్వేషన్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై శనివారం విచారణ జరిగింది. అక్టోబర్ 8వ తేదీకి హైకోర్టు విచారణను వాయి దా వేసింది.

అయితే ఆ లోపు ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చిన మెరిట్ ప్రకారం కేసు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని ఎస్‌ఇసి హైకోర్టుకు నివేదించింది. ఎన్నికల నో టిఫికేషన్ ఎ ప్పుడు ఇస్తారని ఉన్నత న్యాయస్థా నం ప్రశ్నించగా, తాము అన్ని ఏర్పాట్లు చేశామ ని, ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం గా ఉన్నామని కమిషన్ పేర్కొంది. అయితే నోటిఫికేషన్‌కు ముందే పిటిషన్లు దాఖలైనందు న విచారణ కొనసాగుతుందని కోర్టు చెప్పింది.

రెండు దశల్లో ఎన్నికలు..?

గతంలో పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు మూడు దశల్లో జరగగా.. ఈసారి రెండు విడతల్లోనే పూర్తిచేసే ఆలోచనతో ఎస్‌ఇసి ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసుకున్నట్టుగా ఎస్‌ఇసి వర్గాలు వెల్లడించాయి. బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేసుకొని, ఎన్నికల సిబ్బంది ఎంపిక, శిక్షణ, ఎన్నికల మె టీరియల్ ప్రింట్ చేసి, మార్గదర్శకాలు, ఇతర పుస్తకాల ముద్రణ, తదితరాల తయారీ, గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఉన్నతాధికారులతో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదినీ భేటీ అ య్యారు. ఈ సమావేశంలో సిఎస్ రామకృష్ణారావు, అదనపు డిజి మహేశ్ భగవత్, పంచాయతీరాజ్, ఆర్థిక శాఖల ముఖ్యకార్యదర్శులు, ఎక్సైజ్ కమిషనర్ తదితరులు హాజరయ్యారు.

Tags

Next Story