‘మెట్రో’లో ప్రయాణించిన మంత్రి శ్రీధర్ బాబు

‘మెట్రో’లో ప్రయాణించిన మంత్రి శ్రీధర్ బాబు
X
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నగరవాసుల ‘మెట్రో‘ అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం మెట్రో రైలులో ఆకస్మికంగా ప్రయాణించారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నగరవాసుల ‘మెట్రో‘ అనుభవాలను స్వయంగా తెలుసుకునేందుకు శనివారం మెట్రో రైలులో ఆకస్మికంగా ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా టికెట్ కొని, తూర్పున ఉన్న నాగోల్ స్టేషన్ నుండి పశ్చిమాన ఉన్న ఐటీ కారిడార్ రాయదుర్గం వరకు ప్రయాణించారు. మెట్రో సేవలు, సౌకర్యాలు, స్టేషన్లలో భద్రత, రవాణా సవాళ్లు, ట్రాఫిక్ తదితర అంశాలపై ప్రయాణీకులతో ముచ్చటించారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన రవాణాను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రయాణీకులకు వివరించారు. నగరంలో ప్రజా రవాణా బలోపేతానికి ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలు, మెట్రో ఫేజ్ - 2 విస్తరణ, ఆర్‌ఆర్‌ఆర్, ఇతర భవిష్యత్తు ప్రణాళికలను ప్రయాణీకులకు వివరించారు. సలహాలు, సూచనలు స్వీకరించారు. ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రశంసలను తీసుకుంట్లుగానే విమర్శలను స్వీకరిస్తామని చెప్పారు. భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాష్ట్రాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

Tags

Next Story