హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ

హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ
X
దసరా పండుగకు సొంత ఊరికి వెళ్లే వారితో హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్

దసరా పండుగకు సొంత ఊరికి వెళ్లే వారితో హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా వెళ్లాయి. దీంతోపాటు ఎల్బీనగర్ నుంచి అబ్దులాపూర్ మెట్ వరకు ట్రాఫిక్ జామ్ పెరిగింది. దీనికితోడు అబ్దులాపూర్ మెట్ మండలం గౌరెల్లి వద్ద వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో అక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి వంతెన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు వర్షాలకు ఉప్పల్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ జాం ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతోపాటు పంతంగి టోల్‌గేట్, వరంగల్ వెళ్లే మార్గంలోని టోల్‌గేట్‌ల వద్ద భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సుమారుగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


స్వస్థలాల బాట పట్టిన నగరవాసులు

దసరా పండుగ నేపథ్యంలో నగరవాసులు స్వస్థలాల బాట పట్టారు. స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు ప్రారంభం కావడంతో దసరా పండుగకు ప్రజలు సొంతూరుకు వెళుతున్నారు. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు దసరా పండగ నేపథ్యంలో మొత్తం 13 రోజుల పాటు సెలవులను ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్- టు విజయవాడ జాతీయ రహదారిలో వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీతో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ట్రాఫిక్ సమస్యలు మాత్రం నివారించలేకపోయారు. దీంతో హైదరాబాద్ -టు విజయవాడ జాతీయ రహదారి (65వ నంబర్)లో వాహనాల రద్దీ పెరిగింది. అనంతరం విజయవాడ వైపు వాహనదారులు బారులు తీరారు. దసరా పండుగను పురస్కరించుకొని ఆర్టీసి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags

Next Story